NRI-NRT

వందేభారత్ గల్ఫ్ విమానాలు పెంచండి

Nandini Abbagouni Requests More Vande Bharat Flights From Gulf

వందే భారత్ గల్ఫ్ విమానాల సంఖ్య పెంచండి : కేంద్రానికి తెలంగాణ జాగృతి ఖతర్ అధ్యక్షురాలు నందిని అబ్బగౌని వినతి

లాక్‌డౌన్‌ కారణంగా విదేశాలలో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు చేపట్టిన భారత్‌ ప్రభుత్వ వందే మిషన్‌ ప్రారంభించిన విషయం విదితమే. ఇందులో భాగంగా గల్ఫ్ కు ముఖ్యంగా ఖతర్ నుండి హైదరాబాద్ కు విమానాల సంఖ్య పెంచాలని కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి డా. ఆర్ ఎస్ జైశంకర్ గారిని మరియు కేంద్ర విమానయాన మంత్రి హారదీప్ సింగ్ సూరి గారిని ట్విట్టర్ లో అభ్యర్థించారు.

60 దేశాల నుంచి లక్ష మందిని తీసుకురావాలని లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాలు ముఖ్యంగా తెలంగాణ నుండి వేల సంఖ్యలో ఉపాధి కోల్పోయి , ఇతరత్రా ఎమర్జెన్సీ ల వలన భారత్ తిరిగి రావడానికి గల్ఫ్ దేశాల్లో ఉన్న భారత ఎంబసీ లాల్లో తమ వివరాలు నమోదు చేసుకున్నారని కానీ సరేపడే విమానాలు లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
అదే విధంగా ఉపాధి కోల్పోయి భారత్ తిరిగి రావాలని ఉన్నా టికెట్ కు డబ్బులు లేక పేద గల్ఫ్ NRI లు ఇబ్బంది పడుతున్నారని, వీళ్ళందరూ తమ తమ ఊళ్లకు తిరిగి వచ్చేలా కేంద్ర ప్రభుత్వం ఉచితంగా విమానా టికెట్ లు అందచేయాలని కోరారు.