Movies

ఘనంగా NTR జయంతి-TNI కథనాలు

NTR 97th Birthday Celebrated In Telugu States

* పురంధేశ్వరీ….
# ఎన్టీఆర్ ఆశయాల్ని సిధ్ధాంతాలను సాధించినప్పుడే ఆయనకు నిజమైన నివాళి.
# ప్రతి జన్మలో ఎన్టీఆర్ బిడ్డగానే పుట్టాలని కోరుకుంటున్నాను
# ఎన్టీఆర్ బాధతో కన్నీరు కార్చితే.. ప్రజలు రక్త కన్నీరు కార్చారు
# ఎన్టీఆర్ ప్రభంజనాన్ని ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు

* లక్ష్మీపార్వతీ @ఎన్టీఆర్ ఘాట్….
# ఎన్టీఆర్ షూట్ లో నివాళులర్పించిన లక్ష్మీ పార్వతీ.
# కేసీఆర్, జగన్ లకు ఎన్టీఆర్ ఆశీస్సులు ఉన్నాయి.
# ఎన్టీఆర్ ఆశయాలు కొనసాగించే వారికే ఆయన ఆశీస్సులుంటాయి.
# అదృష్టం కొద్దీ తెలుగు రాష్ట్రాలకు మంచి ముఖ్యమంత్రులు దొరికారు.
# ఎన్టీఆర్, వైఎస్ ఆశయాలను జగన్ కొనసాగిస్తున్నారు.
# తెలంగాణ ప్రజలను కేసీఆర్ గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారు.
# తెలుగు వారి కష్టాలను తీర్చటానికి ఇద్దరు ముఖ్యమంత్రులు కష్టపడ్తున్నారు.

* తెదేపా వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి, పద్మశ్రీ నందమూరి. తారకరామారావు 97వ, జయంతి సందర్భంగా “చంద్రబాబు నాయుడు ఫ్యాన్స్ అసోసియేషన్” అధ్యక్షుడు,ఓయూ పరిశోధన విద్యార్థి తలారి.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం, ఆర్ట్స్ కళాశాల ఎదుట ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

* తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు 97 వ జయంతిని ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు కూకట్పల్లి జె.ఎన్.టి.యు ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు కెపిహెచ్బి డివిజన్ అధ్యక్షుడు అట్లూరి దీపక్ చౌదరి ఆధ్వర్యంలో రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి కట్టా నర్సింగరావు మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ ఇన్చార్జ్ పద్మ చౌదరి, గోపి, లలిత తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నటుడిగా తెలుగు చలనచిత్ర సీమకు, ముఖ్యమంత్రిగా తెలుగు ప్రజలకు ఎన్టీఆర్ చేసిన సేవలను వారు కొనియాడారు.

* తెలుగు జాతి కీర్తిని దేశ సరిహద్దుల ఆవలకు సైతం వ్యాపింపచేసిన మహానుభావుడు ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాల్సిందేనని టీడీపీ శ్రేణులు ముక్తకంఠంతో నినదించాయి. ఎన్టీఆర్ కు దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఇవ్వాలంటూ మహానాడులో టీడీపీ ఏకగ్రీవ తీర్మానం చేసింది.అసలు ఎన్టీఆర్ కు భారతరత్న ప్రకటించాలన్న డిమాండ్లు ఇప్పటివి కావు. ఎన్నో ఏళ్లుగా వినిపిస్తూనే ఉన్నాయి. ఇవాళ ఎన్టీఆర్ 97వ జయంతి సందర్భంగా టీడీపీ మహానాడులో ఈ అంశం చర్చకు రాగా, అందరూ డిమాండ్ ను బలపరిచారు. ఈ సందర్భంగా పార్టీ అధినేత చంద్రబాబు మాట్లాడుతూ, ఎన్టీఆర్ ఓ వ్యవస్థ అని, ఆయనకు భారతరత్న కోసం టీడీపీ కృషి చేస్తోందని తెలిపారు. సేవాభావానికి ప్రతీకగా నిలవడం ద్వారా ఎన్టీఆర్ అందరికీ ఆదర్శప్రాయుడయ్యాడన్నారు.

* విజయనగరం జిల్లా శృంగవరపుకోట. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు 97వ జయంతిని మండల పార్టీ అధ్యక్షులు జిఎస్ నాయుడు స్వగృహంలో గురువారం ఘనంగా నిర్వహించారు.

* మహానటుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయన మనవడు, సినీనటుడు జూనియర్ ఎన్టీఆర్ భావోద్వేగభరిత ట్వీట్ చేశాడు. ‘మీరు లేని లోటు తీరనిది’ అని పేర్కొన్నాడు.’మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోంది. మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతోంది. పెద్ద మనసుతో ఈ ధరిత్రిని, ఈ గుండెను మరొక్కసారి తాకిపో తాతా. సదా మీ ప్రేమకు బానిసను’ అంటూ తారక్ సీనియర్ ఎన్టీఆర్ ఫొటోను పోస్ట్ చేశాడు.కాగా, ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా ఆయనకు పలువురు ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. ఆయనతో అప్పట్లో గడిపిన మధురానుభూతులను గుర్తు చేసుకుంటున్నారు.

* కర్నూలు జిల్లా పత్తికొండలో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, యుగపురుషుడు ఆంధ్రుల ఆరాధ్య దైవం అన్న నందమూరి తారక రామారావు గారి జయంతి వేడుకలను ఘనంగా నేడు పత్తికొండ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కార్యాలయం నందుఈ కార్యక్రమం నిర్వహించారు

* తెలుగు వారి ఆరాధ్య దైవం స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి 97 వ జయంతి నీ పురస్కరించుకొని షాద్ నగర్ బివిరావ్ నగర్ కమ్యూనిటీ హాల్ లో కమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు.

* బాలకృష్ణ @ఎన్టీఆర్ ఘాట్ ::: తెలుగు జాతికి ఎన్టీఆర్ చిరస్మరణీయులు. పార్టీ పెట్టి తొమ్మిది నెలల్లో అధికారంలోకి వచ్చి తెలుగు వారి ఆత్మగౌరవాణ్ణి ప్రపంచానికి చాటారు.

* ఎన్టీఆర్ జయంతి రోజు మహానాడును నిర్వహిస్తూ ఒక పర్వదినంగా పాటిస్తూ వస్తూన్నామన్నారు మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు. ప్రస్తుత పాలనలో ప్రజలు పడుతున్న సమస్యలు గురించి ఈ మహానాడులో చర్చిస్తున్నామన్నారు. టీడీపీ వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్టీఆర్ 97వ జయంతి సందర్భంగా విజయనగరంలోని కోట వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పార్టీ కార్యకర్తలు తో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు అశోక్ గజపతి రాజు.

* చంద్రబాబునాయుడు…
• ఎన్టీఆర్ వ్యక్తి కాదు వ్యవస్థ.
• ఎన్టీఆర్ జీవితం ఆదర్శనీయం
• సేవకు నిలువెత్తు రూపం ఎన్టీఆర్
• మనపై బురదజల్లిన వారే బురదలో కూరుకుపోయారు
• రాజకీయాల్లో ఎన్టీఆర్ కు సాటిలేరు