ScienceAndTech

2021 లోపు కరోనా వ్యాక్సిన్

Indian officials release statement saying corona vaccine will come before 2021

కరోనాకు ఏడాదిలోపే వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడానికి మన దేశం తీవ్రంగా కృషి చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ ముఖ్య శాస్త్రసాంకేతిక సలహాదారు ప్రొఫెసర్‌ కె.విజయరాఘవన్‌ తెలిపారు. 10-15 ఏళ్లలో రూపొందించే వ్యాక్సిన్‌కు 200-300 మిలియన్‌ డాలర్లు ఖర్చయితే, ఏడాది వ్యవధిలో దీనిని అందుబాటులోకి తీసుకురావటానికి 200-300 బిలియన్‌ డాలర్లు వ్యయం అవుతుందన్నారు. దేశంలో 30 బృందాలు వ్యాక్సిన్‌ అభివృద్ధి కోసం శ్రమిస్తున్నట్లు తెలిపారు. కాగా, 20 స్వదేశీ కంపెనీలు దేశంలో కొవిడ్‌ పరీక్ష కిట్లు తయారు చేస్తున్నాయని నీతి ఆయోగ్‌ సభ్యుడు వినోద్‌ పాల్‌ తెలిపారు. మన అవసరాలు తీరితే ప్రపంచానికీ వాటిని అందిస్తామన్నారు. రోజూ 5 లక్షల కిట్లు తయారుచేసే సామర్థ్యం ఇప్పుడు భారతీయ సంస్థలు సాధించినట్లు వెల్లడించారు.