Business

అంతర్జాతీయ విమానాల సంఖ్య పెంపుదల

International Flights Under Vande Bharat Mission Increased

లాక్‌డౌన్ కార‌ణంగా విదేశాల్లో చిక్కుకున్న భార‌తీయుల‌ను కేంద్ర ప్ర‌భుత్వం వందేభార‌త్ మిష‌న్ పేరుతో స్వ‌దేశానికి త‌ర‌లిస్తున్న‌ది. ఇందులో మొద‌టి ద‌శ ఇప్ప‌టికే ముగిసింది.

మే 16 నుంచి రెండో ద‌శ కొనసాగుతున్న‌ది. అయితే, మిష‌న్‌లో ముందు పేర్కొన్న విమానాల‌తోపాటు అద‌నంగా మ‌రికొన్ని విమానాల‌ను జోడించారు.

ఈ అద‌న‌పు విమానాల కోసం టికెట్ల బుకింగ్ జూన్ 30న ప్రారంభ‌మ‌వుతుంద‌ని భార‌త పౌర విమాన‌యాన శాఖ మంత్రి హ‌ర్దీప్ సింగ్ పురి తెలిపారు.

వందేభార‌త్ మిష‌న్ రెండోద‌శ‌లో అద‌నంగా చేరిన విమానాల వివ‌రాలు ఈ విధంగా ఉన్నాయి.

అక్లాండ్ నుంచి భార‌తీయుల‌ను తీసుకొచ్చేందుకు జూన్ 34న ఒక విమానం ఢిల్లీ నుంచి అక్లాండ్‌కు వెళ్ల‌నుంది.

జూన్ 5న ఢిల్లీ నుంచి షికాగో, స్టాక్‌హోమ్‌కు మ‌రో విమానం బ‌య‌లుదేర‌నుంది.

ఇక‌ జూన్ 6న ఢిల్లీ నుంచి న్యూయార్క్‌, ఫ్రాంక్‌ఫ‌ర్ట్‌, సియోల్‌కు ఒక‌ విమానం, ‌‌ముంబై నుంచి లండ‌న్, న్యూయార్క్‌కు మ‌రో విమానం వెళ్ల‌నున్నాయి.

అంటే మొత్తం నాలుగు స‌ర్వీసులను మిష‌న్‌లో అద‌నంగా చేర్చారు.