Politics

K అంటే కాల్వలు, C అంటే చెరువులు, R అంటే రిజర్వాయర్లు

KTR Expands KCR

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే ఏమిటో ఆయన తనయుడు, మంత్రి కేటీఆర్ కొత్త నిర్వచనం చెప్పారు. KCRలో K అంటే కాల్వలు, C అంటే చెరువులు, R అంటే రిజర్వాయర్లు అని అర్థమని అన్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.ఈరోజు మేడిగడ్డ నుంచి కొండపోచమ్మ వరకు 82 మీటర్ల నుంచి 618 మీటర్ల ఎత్తు వరకు నీటిని పంప్ చేయడానికి కేసీఆర్ మోటార్ స్విచ్ ఆన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని కేటీఆర్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇదని చెప్పారు. ఇండియాలో కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం కేవలం మూడేళ్లలోనే ఈ ప్రాజక్టును నిర్మించిందని తెలిపారు. ఈ ప్రాజెక్టు వల్ల 2.85 లక్షల ఎకరాల సాగు భూమికి నీరు అందుతుందని చెప్పారు. త్వరలోనే ప్రారంభం అయ్యే కేశవపురం రిజర్వాయర్ ద్వారా హైదరాబాద్ తాగునీటి సమస్యలన్నీ పరిష్కారమవుతాయని తెలిపారు.