NRI-NRT

సింగపూర్‌లో అన్నమయ్య ఆరాధనోత్సవాలు

Annamayya Aaradhanotsavam 2020 In Singapore

సింగపూర్‌ కేంద్రంగా పనిచేస్తున్న తెలుగు భాగవత ప్రచార సమితి అంతర్జాతీయ శాఖ ‘అన్నమయ్య శతగళార్చన ఆరాధనోత్సవాలు’ నిర్వహించింది. కరోనా నేపథ్యంలో ఈ మూడో సమ్మేళనాన్ని ఆన్‌లైన్‌లో నిర్వహించామని అంతర్జాతీయ శాఖ అధ్యక్షుడు ఊలపల్లి భాస్కర్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐదు దేశాల నుంచి 17 మంది అభ్యర్థులతోపాటు, రెండు వందల మందికిపైగా లైవ్‌ ప్రేక్షకులతో విజయవంతంగా నిర్వహించామని చెప్పారు. అమెరికా, బ్రిటన్‌, న్యూజిలాండ్‌, భారత్‌, దుబాయ్‌, జర్మనీ, సింగపూర్‌ నుంచి తెలుగువారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.