Business

భారత స్థిరాస్తి రంగం కుదేలు

Indian Real Estate Collapsed By 12% In Last Quarter

గత ఆర్థిక సంవత్సరం (2019-20) భారత స్థిరాస్తి రంగంలో సంస్థాగత పెట్టుబడులు 12 శాతం తగ్గి 448 కోట్ల డాలర్లకు (సుమారు రూ.33,800 కోట్లు) పరిమితమయ్యాయని ఓ నివేదిక పేర్కొంది. ఈ పెట్టుబడుల విలువ గత ఐదేళ్లలోనే కనిష్ఠం కావడం గమనార్హం. ఆర్థిక వ్యవస్థ మందగమనంలో సాగడం, కరోనా వైరస్‌ ప్రభావంపై అనిశ్చితులు ఇందుకు కారణమయ్యాయి. అమెరికాకు చెందిన స్థిరాస్తి కన్సల్టెంట్‌ సంస్థ వెస్టియన్‌ ఈ నివేదిక రూపొందించింది. ఈ నివేదిక ప్రకారం.. గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలోనూ దేశీయ స్థిరాస్తి రంగంలో సంస్థాగత పెట్టుబడుల విలువ 44 శాతం క్షీణించి 72.7 కోట్ల డాలర్లుగా (సుమారు రూ.5,500 కోట్లు) నమోదయ్యాయి.