Movies

కంగనా కొత్త కళ

Kangana Ranaut New Role As Interior Designer

బాలీవుడ్‌ క్వీన్‌ కంగనా రనౌత్‌ లాక్‌డౌన్‌లో సైతం ఖాళీ లేకుండా పని చేస్తున్నారు. తన సోదరి రంగోలీ కోసం కంగన ఇంటీరియర్‌‌ డిజైనర్‌గా అవతారమెత్తారు. ఇటీవల రంగోలీ దంపతులు కులూలో ఓ అందమైన ఇంటిని నిర్మించుకున్నారు. లాక్‌డౌన్‌ ప్రారంభమైన సమయంలోనే వీరి గృహప్రవేశ వేడుక జరిగింది. అయితే ప్రస్తుతం ఆ ఇంటి అలంకరణ పనులను కంగన చూసుకుంటున్నారు. గత కొన్ని రోజులుగా శ్రమించి రంగోలీ అభిరుచికి తగట్టు గృహాన్ని కొంత వరకూ అలంకరించారు. ఈ మేరకు రంగోలీ ఇన్‌స్టా వేదికగా ఓ స్పెషల్‌ వీడియోతోపాటు పలు ఫొటోలను పోస్ట్‌ చేశారు.