WorldWonders

కూలిపోయిన పాకిస్థాన్ విమానంలో ₹3కోట్ల అక్రమ సొత్తు

Officials Identify 3Crore Rupees of Unaccounted Money In Crashed Pakistani Flight

ఇటీవల కూలిపోయిన పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్‌ విమానం శకలాల్లో దర్యాప్తు అధికారులు 3 కోట్ల పాకిస్తానీ రూపాయల విలువైన నగదును స్వాధీనం చేసుకున్నారు.

దాదాపు మూడు బ్యాగుల్లో వివిధ దేశాలకు చెందిన కరెన్సీల్లో ఈ నగదు ఉన్నట్టు ఓ అధికారి వెల్లడించారు.

‘‘ఎయిర్‌పోర్టు భద్రతా సిబ్బంది, బ్యాగేజి స్కానర్లను దాటుకుని ఇంత పెద్దమొత్తంలో విమానంలోకి డబ్బు ఎలా వచ్చిందన్న దానిపై విచారణ జరుపుతున్నాం…’’ అని ఆయన పేర్కొన్నారు.

ప్రస్తుతం మృత దేహాలు, వారి వస్తువుల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోందనీ.. బాధిత కుటుంబాలకు వాటిని అప్పగిస్తామని ఆయన అన్నారు.