Videos

జుంబారే రీలోడెడ్-[Video]

Krishna Song Jumbaare Jujumbare Reloaded - TNILIVE Videos

ఎస్‌వీ కృష్ణారెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన‌ య‌మ‌లీల చిత్రంలో జుంబారే..జుజుంబ‌రే అనే సాంగ్ ఎంత పాపుల‌రో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఎస్పీబీ, చిత్ర పాడిన ఈ పాట‌కి జొన్న‌విత్తుల లిరిక్స్ అందించారు. పాట‌లో కృష్ణ‌, పూజా త‌మ డ్యాన్సుల‌తో ఆక‌ట్టుకున్నారు. ఇప్పుడు ఇదే పాట‌ని స‌రికొత్త స్టైల్‌లో రూపొందించారు అశోక్ గ‌ల్లా. మ‌హేష్ బాబు మేనల్లుడు, టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు గ‌ల్లా అశోక్ హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. నిధి అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ భిన్న త‌ర‌హా ఎంట‌ర్‌టైన‌ర్‌కు శ్రీ‌రామ్ ఆదిత్య ద‌ర్శ‌కుడు. అమ‌ర‌రాజా మీడియా అండ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై ప‌ద్మావ‌తి గ‌ల్లా నిర్మిస్తోన్న ఈ చిత్రంలో జ‌గ‌ప‌తిబాబు, న‌రేష్‌, స‌త్యా, అర్చ‌నా సౌంద‌ర్య కీల‌క పాత్ర‌ధారులు. ఈ సినిమాకు సంబంధించి 50 శాతం చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. క‌రోనా వైర‌స్ వ్యాప్తి నియంత్రణకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడంతో సినిమా షూటింగ్ నిలిచిపోయింది. అయితే ఈ సినిమాలో ‘జుంబారే’అనే సాంగ్‌ని స‌రికొత్త‌గా రూపొందించ‌గా, కృష్ణ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా వీడియో విడుద‌ల చేశారు. జుంబారే సాంగ్ రీలోడెడ్ అంటూ విడుద‌లైన ఈ సాంగ్ ఆక‌ట్టుకుంటుంది.