DailyDose

తెలంగాణాలో జూన్ 7వరకు లాక్‌డౌన్-TNI బులెటిన్

TNILIVE Corona Bulletin - Telangana Extends Lock Down Until June 7th

* రాష్ట్రంలో కొత్తగా 98 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 3042కు చేరింది.ఇవాళ కరోనాతో ఇద్దరు మృతి చెందగా.. ఇప్పటి వరకూ 62 మంది ప్రాణాలు కోల్పోయారు.గడిచిన 24 గంటల్లో 9504 మంది నుంచి నమూనాల సేకరించారు.2092 మంది బాధితులు ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి కాగా.. 792 మంది చికిత్స పొందుతున్నారు.కొత్తగా నమోదైన 70 కేసుల్లో 3 కోయంబేడు కాంటాక్ట్‌ కేసులున్నాయి.

* వివిధ రాష్ట్రాల నుంచి రైళ్ల ద్వారా రాష్ట్రానికి వచ్చే ప్రయాణికులకు కరోనా నిర్ధారణ పరీక్షలు జరపాలా..? వద్దా..? అన్నదానిపై వైద్యారోగ్య శాఖ మల్లగుల్లాలు పడుతోంది. ప్రత్యేక బస్సులు, రైళ్ల ద్వారా రాష్ట్రంలోకి వచ్చిన వారిని క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించి పరీక్షలు చేస్తున్నారు.

* ఏపిలో 3042 కి చేరుకున్న కరోన పాజీటివ్ కేసులు. గడిచిన 24 గంటల్లో 98 కేసులు నమోదు.

* ప్రధానమంత్రి నరేంద్రమోదీ మన్​ కీ బాత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. భవిష్యత్తులో మనం మరింత జాగ్రత్తగా ఉండాలి. కరోనా వల్ల దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ క్రమంగా పుంజుకుంటోంది. ప్రతిఒక్కరూ భౌతికదూరం పాటిస్తూ మాస్కులు ధరించాలి. పారిశుద్ధ్య కార్మికులకు కృతజ్ఞతలు తెలిపారు.

* దేశ రాజధాని దిల్లీలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 20వేలకు చేరువగా ఉంది. ఈ రోజు కొత్తగా 1295 కేసులు నమోదు కాగా, 13మంది చనిపోయారు. దీంతో కరోనా బాధితుల సంఖ్య 19844కు చేరింది. ఇప్పటివరకూ కరోనా బారినపడి 473మంది చనిపోయినట్లు దిల్లీ ప్రభుత్వం వెల్లడించింది.

* కర్ణాటకలో కొత్తగా 299 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 3221కి చేరింది. ఇప్పటివరకూ 51మంది చనిపోయారు.

* దేశంలోనే అత్యధిక కరోనా కేసులు నమోదైన రాష్ట్రంగా నిలిచిన మహారాష్ట్రలో లాక్‌డౌన్‌ జూన్‌ 30 వరకూ పొడిగించారు. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాత్రి 9 నుంచి ఉదయం 5గంటల వరకూ అత్యవసర సర్వీసులు మినహా అన్నింటికీ కర్ఫ్యూ వర్తిస్తుంది. అయితే, జూన్‌ 8వ తేదీ నుంచి ప్రైవేటు కార్యలయాలు 10శాతం ఉద్యోగులతో తమ కార్యాకలపాలు నిర్వహించుకోవచ్చు. మిగిలిన వారితో వర్క్‌ ఫ్రమ్‌ హోం చేయించుకోవాలి. రాష్ట్రంలో వివిధ జిల్లాల మధ్య బస్సులు తిరుగుతాయి. అయితే, అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులకు అనుమతి లేదు.

* తెలంగాణలో లాక్‌డౌన్‌ను జూన్‌ 7వ తేదీ వరకూ పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాత్రి 9 నుంచి ఉదయం 5గంటల వరకూ కర్ఫ్యూ కొనసాగుతుంది. ఈ మేరకు లాక్‌డౌన్‌ నిబంధనలు సడలిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంతర్రాష్ట్ర ప్రయాణాలపై నిషేధం ఎత్తివేసింది. ఇక కంటైన్మెంట్‌ జోన్లలో జూన్‌ 30 వరకూ లాక్‌డౌన్‌ యథావిధిగా కొనసాగుతుంది.

* కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రత్యేక రైళ్లలో ప్రయాణించాలనుకునే వారికి దక్షిణ మధ్య రైల్వే (ద.మ.రైల్వే) పలు సూచనలు చేసింది. ఈ మేరకు ద.మ.రైల్వే ఓ ప్రకటన విడుదల చేసింది. రైలు బయలుదేరడానికి 90 నిమిషాల ముందే స్టేషన్‌కు రావాలని ప్రయాణికులకు సూచించింది. టికెట్లు ఉన్నవారిని మాత్రమే రైల్వే ప్రాంగణం, రైళ్లలోకి అనుమతిస్తామని స్పష్టం చేసింది. కరోనా లక్షణాలు ఉన్న ప్రయాణికులను ఎట్టిపరిస్థితుల్లో రైళ్లలోకి అనుమతించేది లేదని పేర్కొంది.