Movies

జొన్నవిత్తులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు

SC ST Case Filed On Jonnavitthula

ఓ టీవీ ఛానెల్‌ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీల మనోభావాలు దెబ్బతినేలా పద్యం పాడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీగేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద నాంపల్లి పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. అంటరానితనాన్ని కొనసాగించాలనేలా ఆయన మార్చి 23న కరోనాపై పద్యం పాడారని, ఏప్రిల్‌ 14న అంబేడ్కర్‌ జయంతి రోజునే ఓ యూట్యూబ్‌ ఛానెల్‌లో అప్‌లోడ్‌ చేశారని మాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల రాంప్రసాద్‌ ఫిర్యాదు చేశారు. ఈ కేసులో న్యాయ నిపుణుల సలహాల మేరకు తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు పోలీసులు చెప్పారు.