Agriculture

పాత టైర్లతో డ్రాగన్ ఫ్రూట్ వ్యవసాయం

Telugu agricultural news-Telangana farmer uses old tyres to cultivate dragon fruits

కాస్తంత ఆలోచిస్తే చాలు.. సాగులో సరికొత్త ప్రయోగాలు చేయవచ్చన్న దానికి ఇది చక్కటి ఉదాహరణ. సిద్దిపేట జిల్లా ములుగు మండలంలోని మామిడాల గ్రామ పరిధిలో దాచారం బాలనరసింహా అనే రైతు డ్రాగన్‌ ఫ్రూట్‌ పండిస్తున్నారు. తెలంగాణలో రైతులు ఇప్పుడిప్పుడే ఈ పంట సాగుపై ఆసక్తి కనబరుస్తున్నారు. పంట చేలో పాతిన స్తంభాలపై సాధారణంగా సిమెంటు పలకలు వాడతారు. బాలనరసింహా వాటికి బదులు వాహనాలపాత టైర్లను ఏర్పాటు చేశారు. తద్వారా ఖర్చు తగ్గడంతో పాటు పండ్లు కోయడం సులభంగా ఉంటుందని ఆయన తెలిపారు.