DailyDose

బెజవాడ గ్యాంగ్‌వార్‌లో పాల్గొన్న 13మంది అరెస్ట్-నేరవార్తలు

VJA CP Dwaraka Tirumala Rao Speaks Of gangwar arrests

* జూపూడి ఓ ఇంట్లో చోరీ.దాబా పైన నిద్రిస్తుండగా తాళాలుపగలగొట్టి నగదు బంగారు అపహరణ

* రామవరప్పాడులో అర్ధరాత్రి దొంగలు హల్ చల్..వేమూరి అపార్ట్మెంట్స్ కి ప్రవేశించిన గుర్తుతెలియని దుండగులు.మూడు ఫ్లోర్ లోని చెప్పులు స్టాండ్ లు చెప్పులు ఎత్తుకెళ్లిన దొంగలు..సీసీ కెమెరాలు రికార్డ్ అయిన దొంగలు దృశ్యాలు..

* కళ్యాణదుర్గం లో ఎక్సైజ్ అధికారుల దాడులురిపోర్టర్ శంకర్ నాయక్ ఇంట్లో మద్యం పట్టివేత368 బాటిళ్ల కర్నాటక మద్యం స్వాధీనంపరారీలో విలేకరి శంకర్ నాయక్

* బుక్కపట్నం పోలీసులు నాటు సారా స్థావరంపై దాడి చేసి 200 లీటర్ల సారా ఊటను ధ్వంసం చేశారు.

* మానసిక వైద్యశాలలో చికిత్స పొందుతున్న వైద్యుడు సుధాకర్‌ను నిర్బంధించడం అతని ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని హైకోర్టు అభిప్రాయపడింది.

* గ్యాంగ్​వార్​ కేసులో ఇప్పటివరకు 13 మందిని అరెస్టు చేశామని విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు.

* కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండల కేంద్రంలోని ఐలాపూర్ గ్రామానికి చెందిన చిట్కూరి సాయిలు తండ్రి రామయ్య రాత్రి సుమారు 2 గంటల సమయంలో ఇంటి పై పడుకున్న సాయిలు ను గుర్తుతెలియని ముగ్గురు వ్యక్తులు వచ్చి కాళ్లు చేతులు కట్టేసి కొట్టి సాయిలు వద్ద ఉన్న మూడు మాసాల బంగారం చెవి పోగు, 2 తులాల వెండి ఆరు వేల ఐదు వందల రూపాయలు నగదు తీసుకెళ్లినట్లు సాయిలు తెలిపారు. కాళ్లు చేతులు కట్టేసి కొట్టినరని అన్నారు. గాయాలైన సాయిలు ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స కొరకు వచ్చినట్లు తెలుసుకొన్న ఎల్లారెడ్డి పోలీస్ ఎస్ ఐ లు వచ్చి చికిత్స చేయించి ఎల్లారెడ్డి డివిజన్ డిఎస్పీ శశాంక్ రెడ్డి, సీఐ రాజ్ శేఖర్,లింగంపేట్ ఎస్ ఐ సుఖేందర్ రెడ్డి డాగ్ స్కార్డ్ తో విచారణ జరిపించారు.

* కంచికచర్ల మండలం కీసర టోల్ ప్లాజా వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులులకు అనుమానాస్పదంగా వెళ్తున్న రెండు ద్వీచక్ర వాహనాలు ఆపి తనిఖీ చేయగా ఇద్దరు వ్యక్తుల వద్ద రెండు లక్షల ఐదు వేల రూపాయల విలువ చేసే నిషేధిత గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు.