Business

బెంట్లీకి కూడా కరోనా కాటు

Bentley Motors Affected By Corona - Lays Off 1000 Employees

బ్రిటన్‌కు చెందిన లగ్జరీ కార్ మేకర్ బెంట్లీ సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడిన నష్టాన్ని పూడ్చుకునేందుకు 1000 మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించింది. అంతేకాదు, భవిష్యత్తులో మరింతమందిని తొలగించే అవకాశం ఉందని హెచ్చరించింది. జర్మనీలోని ఫోక్స్‌వేగన్ గ్రూప్‌నకు చెందిన బెంట్లీ.. ఉద్యోగాల తొలగింపు తొలుత వాలంటరీ స్కీమ్‌లో భాగంగా ఉంటాయని, కానీ భవిష్యత్తులో మాత్రం తప్పనిసరి కోతలు ఉంటాయని పేర్కొంది. సంస్థ పరిమాణాన్ని గణనీయంగా తగ్గించబోతున్నట్టు 4200 మంది ఉద్యోగులకు తెలియజేసినట్టు తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ పేర్కొంది. కరోనా మహమ్మారి తమ అభివృద్ధి ప్రణాళికలను దారుణంగా దెబ్బతీసిందని, కాబట్టి దురదృష్టవశాత్తు వర్క్‌ఫోర్స్‌ను తగ్గించుకోవడం అత్యవసరమైందని బెంట్లీ తెలిపింది.