DailyDose

హత్యకు అఖిలప్రియ సుపారీ-నేరవార్తలు

Bhuma Akhilapriya Paid For Murder - Telugu Crime News

* తనను హత్య చేయించేందుకు మాజీమంత్రి భూమా అఖిలప్రియ దంపతులే సుపారీ ఇచ్చారని పోలీసులు చెప్పిన విషయాలు విని షాక్‌ అయ్యానని తెదేపా నేత ఏవీ సుబ్బారెడ్డి అన్నారు.

* ప్రకాశంజిల్లా యర్రగొండపాలెం లోని ఓ రైసుమిల్లులో అక్రమంగా నిల్వఉంచిన 4 లారీల రేషన్ బియ్యం పట్టివేత సోదాలు కొనసాగిస్తున్నా ఆత్మకూరు పోలీసులు.

* అనంతపురం జిల్లా ధర్మవరం మండలం గొట్లూరు వద్ద వాహనాలు తనఖీ నిర్వహిస్తుండగాఅక్రమంగా పేలుడు పదార్థాలను తరలిస్తున్న ఇద్దరి వ్యక్తులను అదుపులోకి తీసుకొనివారి వద్ద నుండి 500 ఎలక్ట్రిక్ డిటోనేటర్లు 500 జెలెటిన్ టిక్స్ తో పాటు బైకు ను స్వాధీనం చేసుకున్న రూరల్ పోలీసులు

* తణుకు 16వ నెంబర్ జాతీయ రహదారి పెరవలి జంక్షన్ రోడ్డు పై, ప్రమాదం ఇద్దరు యువకులు దుర్మరణం

* ప.గో…జిల్లా నిడమర్రు మండలం పెదనిండ్రకొలను గ్రామంలో జర్నలిస్టుపై హత్యాయత్నం. ఆస్తికోసం రుద్రరాజు శ్రీనివాసరాజు అనే జర్నలిస్టుపై హత్యాయత్నానికి పాల్పడిన అతని అన్న కొడుకు రుద్రరాజు వెంకట గాంధీరాజు.

* మడకశిరపోలీస్ సర్కిల్ పరిదిలో కార్డన్ సెర్చ్ నాటు సారా తయారీ కేంద్రాలపై దాడులు.

* గుంటూరు జిల్లా, తెనాలి, గంగానమ్మపేటలో దారుణంమద్యానికి డబ్బులు ఇవ్వలేదని తల్లిపై కొడుకు కత్తితో దాడికత్తితో తల్లి పీక కోసిన కొడుకు లక్ష్మీనారాయణఆస్పత్రిలో చికిత్సపొందుతూ తల్లి శశి దేవి మృతి

* అమరావతి ఎంపీడీఓ ఉమాదేవి ని సస్పెండ్ చేసిన జిల్లా కలెక్టర్ ఆనంద్ శామ్యూల్..

* తిరువూరు లో 27 లక్షలు పట్టుకున్న పోలీసులు