Politics

డెహ్రాడూన్‌లో షట్‌డౌన్

ఉత్త‌రాఖండ్ రాజ‌ధాని డెహ్రాడూన్ మ‌ళ్లీ ష‌ట్‌డౌన్‌లోకి వెళ్లింది.

డెహ్రాడూన్‌లో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండ‌టంతో ప్ర‌తి వారాంతంలో రెండు రోజులు (శ‌ని, ఆదివారాలు) న‌గ‌రరాన్ని ష‌ట్‌డౌన్ చేయాల‌ని ఇటీవ‌ల ఉత్త‌రాఖండ్ ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది.

ఈ మేర‌కు డెహ్రాడూన్ పోలీసులు న‌గ‌రం అంతటా భారికేడ్లు ఏర్పాటు చేసి జ‌నం రోడ్ల‌పైకి రాకుండా చ‌ర్య‌లు చేప‌ట్టారు.

అత్య‌వ‌స‌రాలు, నిత్య‌వ‌స‌రాల‌కు త‌ప్ప ఎవ‌రూ బ‌య‌ట‌కు రావ‌ద్ద‌ని, అన‌వ‌స‌రంగా బ‌య‌ట‌కు వ‌చ్చేవారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని పోలీసులు ప్ర‌క‌టించారు.