Sports

₹755కోట్ల విరాళం

₹755కోట్ల విరాళం

అమెరికా బాస్కెట్‌బాల్‌ లెజెండ్‌ మైకేల్‌ జోర్డాన్‌ నల్లజాతీయుల శ్రేయస్సు కోసం భారీ విరాళంతో ముందుకొచ్చాడు. వాళ్ల సమానత్వం, సామాజిక న్యాయం, విద్య మొదలగు అంశాల కోసం 100 మిలియన్‌ డాలర్లు (రూ. 755 కోట్లు) ఖర్చు పెట్టనున్నట్టు ప్రకటించాడు. నల్ల జాతీయుల సంక్షేమం కోసం పాటుపడుతున్న వివిధ సంస్థలకు ఈ మొత్తాన్ని రానున్న పదేళ్లలో ఇవ్వనున్నట్టు సోషల్‌ మీడియా ద్వారా జోర్డాన్‌ తెలిపాడు. ఓ పోలీసు దాష్టీకానికి నల్లజాతీయుడైన జార్జ్‌ ఫ్లాయిడ్‌ బలవడంతో అమెరికా వ్యాప్తంగా నిరసన జ్వాలలు రేగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జాత్యహంకార పోరాటానికి తనవంతు సాయం అందించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని 57 ఏళ్ల జోర్డాన్‌ అన్నాడు.