Sports

సెరీనా భర్త రాజీనామా

సెరీనా భర్త రాజీనామా

జాత్యహంకారానికి నిరసనగా ప్రముఖ సోషల్‌ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్‌ రెడిట్‌ సహవ్యవస్థాపకుడు అలెక్సిస్‌ ఒహానియాన్ తన పదవి నుంచి వైదొలగారు. తన స్థానంలో ఓ నల్ల జాతీయుడిని నియమించాలని ఆయన కోరారు. ఈ అమెరికన్‌ వ్యాపార దిగ్గజం, టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నల్లకలువ’ సెరీనా విలియమ్స్‌ భర్త అన్న సంగతి తెలిసిందే. ‘‘నా కుమార్తె పెరిగి పెద్దదై ‘నువ్వేం చేశావ్‌ నాన్నా?’ (జార్జి ఫ్లాయిడ్ మృతి ఘటన గురించి‌) అని అడిగితే.. నా వద్ద సమాధానం ఉండాలి. అందుకే రాజీనామా చేశా’ అని 37 సంవత్సరాల అలెక్సిస్‌ వివరించారు.