Devotional

శబరిమలలో వర్చ్యూవల్ క్యూ పద్ధతి

శబరిమలలో వర్చ్యూవల్ క్యూ పద్ధతి

శబరిమల ఆలయంలో వర్చువల్​ క్యూ పద్ధతి​ ద్వారా దర్శనానికి అనుమతి ఇస్తామని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ వెల్లడించారు.

ఈ విధానంలో ఒకేసారి 50 మందికి వెళ్లే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు.

దర్శనంలో భాగంగా నీలక్కళ్, పంబా, సన్నిధానంలో శరీర ఉష్ణోగ్రతను కొలిచేందుకు థర్మల్​ స్కానర్లు ఏర్పాటు చేస్తామని విజయన్​ తెలిపారు.

ఆలయ దర్శన పునరుద్ధరణలో భాగంగా తీసుకున్న చర్యలను ప్రస్తావించారు.

దర్శనానికి వచ్చే భక్తులు మాస్కులు ధరించటం తప్పనిసరి

దేవాలయ సిబ్బంది కూడా మాస్కులు, గ్లౌజులు ధరించాలి

నెయ్యాభిషేకం కోసం ఉపయోగించే నెయ్యిని అందించేందుకు ప్రత్యేక కౌంటర్ల ఏర్పాటు

పూజారులు ప్రసాద వితరణ చేయకూడదు

కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా 10 ఏళ్లలోపు పిల్లలు, 65 ఏళ్లు పైబడినవారికి ప్రవేశం లేదు

కొడియెట్టు, అరట్టు వంటి వేడుకలకు పరిమిత సంఖ్యలో భక్తులకు అనుమతి