Movies

కొత్త పాఠాలు

కొత్త పాఠాలు

ఎక్కువ సమయం అంతర్జాలం, సామాజిక మాధ్యమాల్లో గడిపేవాళ్లు ‘డిజిటల్‌ డిటాక్స్‌’ పేరుతో కొన్ని రోజులు డిజిటల్‌ మాధ్యమాలకు పూర్తి దూరంగా ఉంటున్నారు. నేనూ కూడా సినిమా షూటింగులు ఉన్నప్పుడు ‘డిజిటల్‌ డిటాక్స్‌’ పద్ధతినే పాటిస్తుంటా కానీ ఇప్పుడు మాత్రం కాదు అంటోంది నాయిక భూమి పెడ్నేకర్‌. ‘‘కొన్నేళ్లుగా నేను ఎంచుకుంటున్న కథలు, పోషించిన పాత్రలు నాకు సవాల్‌ విసిరినవే. అలాంటి పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేయాలంటే సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండాలి. నేను కూడా అదే చేశా. కానీ ప్రస్తుత లాక్‌డౌన్‌ పరిస్థితుల్లో సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండటం చాలా కష్టమైన వ్యవహారం. ‘‘లాక్‌డౌన్‌ సమయంలో అభిమానులతో అనుసంధానమై ఉండటానికి ఉన్న ఏకైక మార్గం సామాజిక మాధ్యమాలే. నా జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను నా అభిమానులతో పంచుకుంటున్నా. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఈ విరామ సమయాన్ని మంచి అవకాశంగా ఉపయోగించుకుంటున్నా’’అంది భూమి.