Fashion

వేణువు వన్నెలు

వేణువు వన్నెలు

అమ్మాయిలు తాము ఎంచుకునే దుస్తులు, నగలు వంటివి అందంగా ఉండాలని మాత్రమే కోరుకోరు. వాటిలో తమ అభిరుచీ కనిపించాలని అనుకుంటారు. అలాంటివే ఈ మురళీ డిజైను పెండెట్లు. ప్రేమకు ప్రతిరూపమైన మురారికి ఎంతో ఇష్టమైన ఈ వాద్యాన్ని అందంగా తమ నగల్లో అమర్చేసుకుంటున్నారు. ఆకులు, రుద్రాక్షలు, కృష్ణుడి ప్రతిమల్లో… ఇలా రకరకాల రూపాల్లో ఇవి చూడచక్కగా ఇమిడిపోతున్నాయి. అలాంటివాటిలోఇవి కొన్ని డిజైన్లు…మీరూ ఓ లుక్కేయండి.