DailyDose

కుర్చీలో నుండి లేవనందుకే బెజవాడ గ్యాంగ్‌వార్-నేరవార్తలు

కుర్చీలో నుండి లేవనందుకే బెజవాడ గ్యాంగ్‌వార్-నేరవార్తలు

* బెజవాడ గ్యాంగ్‌వార్‌పై పోలీసులు పురోగతి సాధించారు..ఇప్పటికే ఈ గ్యాంగ్ వార్ పై విజయవాడ సిటీ కమిషనర్ ద్వారకా తిరమలరావు మీడియా ముందుకు రాగా.. తాజాగా డీసీపీ హర్షవర్ధన్‌ మీడియా సమావేశం నిర్వహించారు..కేసుకు సంబంధించి ఉన్న వారిని సీసీ ఫుటేజీని కూడా డీసీపీ మీడియా ముందు ప్రజెంట్ చేశారు.డీసీపీ హర్షవర్ధన్‌ కామెంట్స్…సెటిల్‌మెంట్ విషయంలోనే పండు-సందీప్ వర్గాల మధ్య ఘర్షణ జరిగిందని హర్షవర్ధన్‌ స్పష్టం చేశారు.గ్యాంగ్‌వార్‌ ఘటనలో ఇప్పటి వరకూ మొత్తం 24 మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.సందీప్ హత్యకు కారణమైన 13 మందిని.. అలాగే పండుపై దాడి చేసిన 11 మందిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు..అపార్ట్‌మెంట్ విషయంలో సెటిల్‌మెంట్ జరిగిన మాట వాస్తవమేనని చెప్పారు.అయితే పండు-సందీప్ వర్గాలు కలుసుకున్నప్పుడు సందీప్ గ్యాంగ్ ముందు పండు కుర్చీలో నుంచి లేవకపోవడం.. పిల్లోడివి ”నా ముందే కుర్చుంటావా” అంటూ సందీప్ వర్గానికి చెందిన కిరణ్‌ కుమార్ కర్రతో రెండు సార్లు కొట్టడంతో ఒక్కసారిగా గొడవ చెలరేగిందని వివరించారు.ఈ గొడవంతటికి కిరణే కారణమని, అతడు రెచ్చగొట్టడం వల్లే ఘర్షణకు దారి తీసిందని డీసీపీ స్పష్టం చేశారు.సెటిల్‌మెంట్ విషయంలో జోక్యం చేసుకోవద్దంటూ సందీప్.. పండు ఇంటికెళ్లి బెదిరించాడన్నారు. ఆ తర్వాత పండు కూడా సందీప్ షాపుకు వెళ్లి కత్తితో హల్‌చల్ చేశాడన్నారు.రెండు గ్యాంగుల్లో ఉన్నవారంతా క్రిమినల్సేనన్నారు.మంగళగిరి, తాడేపల్లిలో రౌడీషేటర్లను అదుపులోకి తీసుకున్నాం.అందరికీ క్రిమినల్ హిస్టరీ ఉందని పేర్కొన్నారు…సందీప్ తన ఫ్రెండ్స్‌నే ఉపయోగించుకున్నాడన్నారు.వీళ్లంతా స్కూళ్లలో పరిచయం ఉందని వివరించారు. బెదిరించాలని వెళ్తే.. చంపుకునేంత వరకూ వెళ్లిందన్నారు.సందీప్ కుటుంబ సభ్యుల ఆరోపణల్లో వాస్తవం లేదు..సందీప్ హత్య వెనుక రాజకీయ నేతల హస్తం ఉందన్న ఆయన భార్య తేజస్వని చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని డీసీపీ అన్నారు..సందీప్ హత్య వెనుక ఎలాంటి రాజకీయ నాయకులు లేరని తేల్చి చెప్పారు.కేవలం మంగళగిరి కి చెందిన రౌడీషేటర్ కిరణ్ అనే వాడు రెచ్చగొట్టడం వల్లే గొడవకు కారణమని చెప్పారు.నిందితుల్లో ముగ్గురు మంగళగిరి నుంచి వచ్చారన్నారు…పండు తల్లికి క్రిమినల్ హిస్టరీ ఉందన్నారు..ఓ కేసులో ఆమె పేరు ఉందని తెలిపారు.ఆమె పాత్రపై కూడా దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.ఆమె పాత్ర ఉందని తేలితే అరెస్ట్ చేస్తామని చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని డీసీపీ హర్షవర్ధన్ వెల్లడించారు.

* గుంటూరు నగరంలో ప్రేమ వ్యవహారంలో ఇద్దరు విద్యార్థులు రెండు వర్గాలుగా విడిపోయి కొట్టుకోవడానికి సిద్దపడడం గుంటూరులో కలకలం రేపింది.

* గుంటూరులోని పలు ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు. బైక్ పై ఇద్దరు వెళితే 1500/-రు చలన మరియు కేసులు నమోదు చేస్తున్నారు.

* అనపర్తిలో 17 మంది పాత్రికేయులపై అక్రమ కేసు.కుతుకులురులో అక్రమ మట్టి తవ్వకాల కవరేజ్ కు వెళ్ళిన పాత్రికేయులు.పాత్రికేయుల పై ఇటుక బట్టి యజమానుల దాడి.పోలీసులకు పాత్రికేయుల పై తప్పుడు పిర్యాదు.అనపర్తి పోలీసు స్టేషన్ లో అర్దరాత్రి హైడ్రామా.సోమవారం తెల్లవారుజాము 2.30 గంటలకు కేసు నమోదుకు సిద్దం.

* కడప జిల్లా దువ్వూరు మండలం చింతకుంట వద్ద జాతీయ రహదారిపై ఆదివారం మధ్యాహ్నం లారీ దగ్ధమైంది. ఈఘటనలో లారీ డ్రైవర్‌‌ సజీవ దహనమయ్యాడు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నుంచి కడప జిల్లా మైదుకూరు వైపుగా వెళ్తున్న సిమెంట్‌ లారీ డివైఢర్‌ను ఢీకొట్టి బోల్తాపడటంతో మంటలు చెలరేగాయి. క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన డ్రైవర్‌‌ బయటకు రాలేక సజీవదహనమయ్యాడు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.