Editorials

ధనము జీవితము భోగము మౌనము

ధనము జీవితము భోగము మౌనము

చాలా మంచి విషయాలు…

👉మనిషి యవ్వనంలో డబ్బు కోసం ఆరోగ్యాన్ని
పోగొట్టుకుంటాడు.
👉వృధ్యాప్యంలో ఆరోగ్యం కోసం డబ్బుని
పోగొట్టుకుంటారు.

👉ఆరోగ్యం ఆస్తికన్నా మిన్న.
ఆరోగ్యం లేని ఆస్తి సున్నా.

👉ఆరోగ్యం విషయంలో స్వార్థంగా ఉండండి.
👉ఆస్తి విషయంలో నిస్వార్థంగా ఉండండి.
👉అపుడు అందరి మెప్పు పొందుతారు.

👉వ్యాయామం చేయడానికి సమయ లేదూ
అనేవాళ్ళు భవిష్యత్తులో జబ్బులకు సమయం
కేటాయించ వలసి వస్తుంది.

👉తిండి విషయంలో …
నాలుకను అదుపులో ఉంచుకున్నోడు యోగి,
నాలుకను అనుసరించేవాడు భోగి,
నాలుకకు బానిసైనవాడు రోగి.

👉డబ్బు సంపాదించవచ్చు …
కానీ నిద్ర సంపాదించలేము.

👉పుస్తకాన్ని కొనవచ్చు …
కానీ జ్ఞానాన్ని కొనలేము.

👉మందులను కొనవచ్చు …
కానీ ఆరోగ్యాన్ని కొనలేము.

👉పగను సంపాదించవచ్చు …
కానీ స్నేహాన్ని కొనలేము.

👉ఆయుధాన్ని కొనవచ్చు …
కానీ ధైర్యాన్ని కొనలేము.

👉భోగాలకు ఖర్చు చేసి రోగాలను తెచ్చుకోకు.

👉మంచి పనులకు ఖర్చు చేసి పుణ్యం పెంచుకో.
ఆ పుణ్యమే రాతను నిర్ణయిస్తాయని
తెలుసుకో.

👉ధనముతో పరుపుని కొనవచ్చు …
కానీ నిద్రను కాదు.

👉ధనముతో విలాసవంతమైన వస్తువులను …
కొనవచ్చు కానీ సంతోషాన్ని కాదు.
దాచిపెట్టి ఏమి చేస్తావు, ఎక్కడ దాస్తావు,
జేబు అయినా ఉండదు శవం మీద గుడ్డకు.

👉ప్రపంచానికి తాను చేసిన మేలే …
మానవునికి నిజమైన సంపద

👉ఎంత సంపాదించామన్నది ముఖ్యం కాదు,
ఎన్ని మంచి పనులు చేశామన్నది ముఖ్యం.

👉ఇతరులకి కష్టం కలిగించడం ఎంత పాపమో,
ఇంకొకరి కష్టం తీర్చడం కూడా అంతే పుణ్యం.

👉జీవితంలో ఈ ముగ్గురినీ దరికి రానివ్వకండి:
1. నీకు విలువ ఇవ్వని వారిని.
2. నిన్ను చూసి ఈర్ష్యపడేవారిని.
3. మనల్ని అర్థం చేసుకోకుండా మన గురించి
ఇతరులకు చెడుగా చెప్పేవారిని.