DailyDose

కీచక ఎస్సై సస్పెన్షన్-నేరవార్తలు

కీచక ఎస్సై సస్పెన్షన్-నేరవార్తలు

* ఓ లాడ్జీలో దిగిన జంటను బెదిరించి వారి నుంచి డబ్బులు గుంజడంతోపాటు మహిళపై లైంగిక వేధింపులకు దిగిన అమరావతి ఎస్సై రామాంజనేయులుపై ఎస్పీ విచారణకు ఆదేశించారు. పోలీసుల కథనం ప్రకారం.. పెదకూరపాడు మండలానికి చెందిన ఓ జంట సోమవారం అమరావతిలోని ఓ లాడ్జిలో దిగింది. సమాచారం అందుకున్న అమరావతి ఎస్సై రామాంజనేయులు వ్యక్తిగత వాహనంలో డ్రైవర్ సాయికృష్ణతో కలిసి లాడ్జికి చేరుకుని వారిని పట్టుకున్నాడు. వ్యభిచారం కేసు నమోదు చేస్తానని వారిని బెదిరించాడు. కేసు నమోదు చేయకుండా ఉండాలంటే రూ. 10 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. తాము అంత ఇచ్చుకోలేమని, రూ. 5 వేలు ఇవ్వగలమని చెప్పి తమ వద్ద ఉన్న మూడువేల రూపాయలను ఎస్సైకి ఇచ్చారు.మిగతా రెండువేల రూపాయల కోసం యువకుడిని ఎస్సై ఏటీఎంకు పంపాడు. అతడికి తోడుగా తన డ్రైవర్‌ను కూడా పంపిన ఎస్సై.. వారు వెళ్లగానే ఒంటరిగా ఉన్న మహిళను లైంగికంగా వేధించాడు. ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. విషయాన్ని ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆమెను హెచ్చరించాడు. ఏటీఎం నుంచి యువకుడు వచ్చిన తర్వాత వారి నుంచి వివరాలు తీసుకుని వదిలిపెట్టాడు. ఎస్సై తీరుపై బాధితులు మంగళవారం డీఎస్పీ శ్రీనివాసరెడ్డికి ఫిర్యాదు చేశారు. ఆయన ఈ విషయాన్ని గుంటూరు రూరల్ ఎస్పీ విజయారావుకు చేరవేశారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ఎస్పీ విచారణకు ఆదేశించారు. నివేదిక వచ్చిన వెంటనే ఎస్సై, అతడి డ్రైవర్‌పై చర్యలు తీసుకోనున్నట్టు డీఎస్పీ శ్రీనివాసరెడ్డి తెలిపారు.

* ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కు పరిచయమైన ఓ మాయలాడి అతడిని నిండా ముంచేసింది. అతడి నుంచి ఏకంగా రూ.3.63 లక్షలు కొట్టేసింది. చివరికి వేధింపులు శ్రుతి మించడంతో తట్టుకోలేని బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసుల కథనం ప్రకారం.. ఐటీ కారిడార్‌లో పనిచేస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కు ఇటీవల ఇన్‌స్టాగ్రాం ద్వారా ఓ యువతి పరిచయం అయింది. అది క్రమంగా స్నేహంగా మారి మరింత ముదిరింది. తర్వాత ఇద్దరూ పరస్పరం ఫొటోలను మార్చుకున్నారు.ఆ తర్వాత మరింత ముందుకెళ్లి ఇద్దరూ నగ్న వీడియోలను షేర్ చేసుకున్నారు. అతడి నగ్నవీడియోలు ఆమె చేతిలో పడిన వెంటనే ఆమె తన ప్లాన్‌ను అమలు చేసింది.

* పోలీసులకు సవాల్ విసురుతున్న ఘరానా దొంగ.చిల్లర వద్దు… లక్షల్లోనే…పదులు,వస్తువులు వదిలేస్తూ.ఉయ్యూరు పట్టణంలో వరుస దొంగతనాలు…ప్రజలు వ్యాపారులు బెంబేలు….పోలీసులకు కునుకు లేకుండా చేస్తున్న ఘరానా దొంగనిన్న హోండా షో రూమ్ లో…మంగళవారం తెల్లవారు జామున నీలిమ ఎంటర్ ప్రైసెస్,నాగ శివ ఎలక్ట్రానిక్స్ లో.ఎటువంటి వస్తువులు చోరీకాలేదు…సీసీ ఫుటేజ్ హార్డ్ డిస్క్ లను నీళ్లలో పడేసిన గుర్తు తెలియని దొంగ.ట్వ్స్ షో రూ లో మాదిరి లాగే ఎక్కువ మొత్తం దొంగ తనానికి ప్రయత్నిస్తున్నట్లు పోలుసుల అంచనా.రంగం లోకి దిగిన డాగ్ స్క్వాడ్…క్రైమ్ స్పాట్స్ టీం.వీరమ్మతల్లి గుడి దాటి పాత విక్రమ్ ఐటీఐ లోకి వెళ్లి ఆగిన పోలీసు జాగిలం.ఆధారాలు సేకరించిన క్రైమ్ స్పాట్ టీం.పట్టణం లోని సీసీ కెమెరాలను పరిశీలించే పనిలో పట్టణ పట్టణ పోలీసులు.

* పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం కైకరం గ్రామం నుండి వెంకటకృష్ణాపురం వెళ్ళే మార్గమధ్యంలో బైక్పై వెళ్తున్న బూరి కనకరాజు తల పైరేకు పడడంతో మృతి చెందాడు. ఈదురు గాలులకు రోడ్డు పక్కనే ఉన్న మద్యం దుకాణం యొక్క పైకప్పు వచ్చి తలపై బలమైన గాయం చేసింది. ఏలూరు ప్రాంతంలో వంగాయ గూడెం కి చెందిన కనకరాజు డెలివరీ బాయ్ గా విధులు నిర్వహిస్తూ ఉంటాడు. ఈ నేపథ్యంలో ఒక్క సారిగా వచ్చిన ఈదురుగాలుల వల్ల షాపు పైకప్పు వచ్చి పడడంతో కనకరాజు సంఘటనా స్థలంలోనే మృత్యువాత పడ్డాడు.

* పశ్చిమగోదావరిజిల్లా పెదవేగి మండలం జానంపేట సమీపంలో రోడ్ ప్రమాదం.ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని షిప్ట్ కా ర్ స్పీడ్ గా వచ్చి ఢీ కొ ట్టింది.ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వస్తున్న భార్యా భ ర్తలకు కాళ్ళు చేతులు విరిగి పోయాయి.