DailyDose

పెరిగిన బులియన్ ధరలు-వాణిజ్యం

పెరిగిన బులియన్ ధరలు-వాణిజ్యం

* బులియన్ మార్కెట్‌లో జూన్ రెండో వారంలోనూ బంగారం ధరలు పెరుగురుతూనే ఉన్నాయి.ఈ రోజు బంగారం ధరలు అతి స్వల్పంగా పెరిగాయి. వెండి ధర కూడా బంగారం ధరతో పోటీ పడుతున్నది.ఢిల్లీ మార్కెట్‌లో వరుసగా మూడోరోజు బంగారం ధరలు పెరిగాయి.బంగార ధర నేటి మార్కెట్‌లో రూ.10 మేర అతి స్వల్పంగా పెరిగింది.దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.46,410కి చేరింది.అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.45,210 అయింది.హైదరాబాద్‌ ,విశాఖ, విజయవాడ మార్కెట్లలో ఈరోజు బంగారం ధర రూ.10 మేర పెరిగింది.దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.48,520కి ఎగబాకగా ….అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.44,480కి చేరింది.వెండి ధర రూ.800 మేర పెరిగింది. దీంతో నేడు 1 కేజీ వెండి ధర ధర రూ.47,820కి చేరింది.దేశ వ్యాప్తంగా వెండి ఇదే ధర వద్ద కొనసాగుతున్నది.

* దుర్గగుడి ఉద్యోగులపై కరోనా వేటు. సుమారు 25 మంది తాత్కాలిక ఉద్యోగుల తొలగింపు…టికెట్ కౌంటర్లు, లడ్డు కౌంటర్లు, దర్శనం టికెట్ కౌంటర్లలో తాత్కాలిక సిబ్బంది స్థానంలో శాశ్వత ఉద్యోగులకు విధులు కేటాయింపు. ఆదాయం లేకపోవటం, ఉన్న సిబ్బంది పని లేకపోవడమే కారణమంటున్న దేవస్థానం అధికారులు.

* దివీస్ ఫార్మా కంపెనీకి ఎన్ జి టి నోటీసు. కాలుష్యాన్ని వెదజల్లుతూ పర్యావరణానికి నష్టం కలిగిస్తోందని ఎన్జీటిని ఆశ్రయించిన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ కు చెందిన కాలుష్య పరిరక్షణ సమితి.

* కరోనా కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌ వల్ల అనేక వ్యాపారాలు తీవ్ర స్థాయిలో దెబ్బతిన్నాయి. నిత్యావసర వస్తువులు మినహా మిగిలిన వాటి గిరాకీ బాగా పడిపోయింది. కానీ, లాక్‌డౌన్‌కి ముందు ఒడుదొడుకులు ఎదుర్కొన్న ప్రముఖ బిస్కెట్ల తయారీ కంపెనీ పార్లేకు మాత్రం ఈ కష్టకాలం కలిసొచ్చింది. లాక్‌డౌన్‌ సమయంలో పార్లే-జీ బిస్కెట్ల విక్రయాలు భారీగా పెరిగినట్లు సంస్థ వెల్లడించింది. గత 40 ఏళ్లలో ఇంత భారీ మొత్తంలో ఎప్పుడూ అమ్మకాలు జరగలేదని కంపెనీ వర్గాలు తెలిపాయి. దాదాపు 5 శాతానికి మార్కెట్‌ షేర్‌ విస్తరించినట్లు వెల్లడించాయి.

* భవిష్యత్తులో విక్రయించే బీఎస్‌6 వాహనాలపై ప్రత్యేకమైన స్టిక్కర్‌ ఉండనుంది. తాజాగా హైవే, రోడ్డు రవాణశాఖ ఈమేరకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్‌ ప్రకారం బీఎస్‌6 వాహనంపై ఒక సెంటీమీటర్‌ మేరకు రెండు రంగుల్లో స్టిక్కర్‌ ఉండనుంది. ఈ నిబంధన అక్టోబర్‌ 1వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. ఇటీవల మోటార్‌ వాహన చట్టాన్ని సవరిచడంతో ఈ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఇప్పటికే 2019 ఏప్రిల్‌ తర్వాత విక్రయించిన అన్ని మోటార్‌ వాహనాలపై టాంపర్డ్‌ ప్రూఫ్‌ నెంబర్‌ ప్లేట్‌ను అమర్చాలనే నియమం అమల్లోకి వచ్చింది.