Kids

ఐరన్ లేడీ…కిరణ్ బేడీ!

ఐరన్ లేడీ...కిరణ్ బేడీ!-The inspirational life story of Kiran Bedi in Telugu

భారతదేశపు మొట్టమొదటి ఐ.పి.ఎస్.అధికారిణి, సామజిక కార్యకర్త, మాజీ టెన్నిస్ ప్లేయర్, రాజకీయవేత్త, రచయిత్రి, ప్రస్తుత పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ గారి. నిన్న ఆమె జన్మదినం
సందర్భంగా???

1972 బ్యాచ్‌కు చెందిన కిరణ్ బేడీ పోలీసు శాఖలో అనేక పదవులు చేపట్టి, అనేక సంస్కరణలు చేపట్టి, మెగసెసె అవార్డుతో సహా పలు అవార్డులను పొందినది. బ్యూరో అఫ్ పోలీస్ రీసెర్చి అండ్ డెవెలప్‌మెంట్ డైరెక్టర్ జనరల్ గా పనిచేస్తూ డిసెంబర్ 2007లో స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకొంది. వరకు స్థానికంగా అమృత్‌సర్ లోనే విద్యాభాసం కొనసాగించింది. 1968-70లో రాజనీతి శాస్త్రంలో పంజాబ్ విశ్వవిద్యాలయం, చండీగర్ నుంచి ఎం.ఏ.పట్టా పొందినది. ఉద్యోగంలో చేరిన తరువాత 1988లో ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో డిగ్రీ పట్టా పొందినది. 1993లో ఢిల్లీ ఐ.ఐ.టి. పి.హెచ్.డి. పట్టాను ప్రధానం చేసింది. కిరణ్ బేడీ చిన్న వయస్సులో మంచి క్రీడాకారిణిగా గుర్తింపు పొందినది. గతంలో అఖిల భారత టెన్నిస్ టైటిల్ ను, ఆల్ ఏషియన్ టెన్నిస్ టైటిల్‌ను గెలుపొందింది. 22 ఏళ్ళ వయసులో ఏషియా మహిళల టైటిల్ ను గెలుపొందినది. 1972లో జూలైలో మొట్టమొదటి ఐ పి యస్ గా ఎన్నికైనారు.1973 జనవరి 26న జరిగిన రిపబ్లిక్ డే పెరేడ్ సందర్భంగా మొట్టమొదట మహిళా ఐ పి యస్ ను చూసిన ప్రజలు ఆనందాశ్చర్యాలకి లోనయ్యారు. ఆ మరుసటిరోజే అప్పటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ ఈమెను అల్పాహారానికి ఆహ్వానించింది.1982లో ప్రధాని ఇందిరాగాంధి కారుని ప్రవేశంలేని చోట ఆపి వుంచిన కారణంతో క్రేన్ సహాయంతో అక్కడనుండి తీయించి వేసింది. ఆసమయాన ఆమె చూపిన కర్తవ్యనిర్వాహణపట్ల ముగ్డులైన ప్రజలు ఆమెను క్రేన్ బేడి అని పిలిచేవారు. 1987లో నవజ్యోతి, 1994లో ఇండియావిజన్ పౌండేషన్ అనే రెండు స్వచ్ఛంద సంస్థలను ఏర్పరిచారు.

ఉద్యోగ జీవితం
కిరణ్ బేడీ అమృత్‌సర్ లోని ఖాల్సా మహిళల కళాశాలలో రాజనీతి శాస్త్రంలో ఉపన్యాసకురాలిగా (లెక్చరర్) జీవితం ప్రారంభించినది (1970-72) . 1972లో ఆమె ఇండియన్ పోలీస్ సర్వీసుకు ఎంపైకైంది. ఢిల్లీలో ట్రాఫిక్ పోలీస్ కమీషనర్‌గా, మిజోరాంలోడిప్యూటీ ఇన్స్‌పెక్టర్ జనరల్ ఆప్ పోలీస్‌గా, చంఢీగర్లెప్టినెంట్ గవర్నర్ సలహాదారునిగా, ఐక్యరాజ్య సమితిలోను పనిచేసింది. ఢిల్లీ ట్రాపిక్ పోలీస్ కమీషనర్ గా ఉన్నప్పుడు రోడ్లపై ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించిన కార్లను క్రేన్లతో పారద్రోలి క్రేన్ బేడీగా ప్రసిద్ధి చెందినది. తీహారు జైలులో పలు సంస్కరణలు ప్రవేశపెట్టి అందరి మన్ననలను పొందింది. వాటి ఫలితంగా ప్రభుత్వ సర్వీసు రంగంలో రామన్ మెగసెసెఅవార్డు పొందినది.

ఆత్మకథ
16-07-1972న భారత పోలీస్‌ వ్యవస్థలోనే సంచలనం చోటు చేసుకుంది. దేశ చరిత్రలోనే తొలిసారిగా ఒక మహిళ ఐపీఎస్‌ ఆఫీసర్‌గా బాధ్యతలు స్వీక రించింది. అమృత్‌సర్‌కు చెందిన డా కిరణ్‌ బేడి ఈ ఘనత సాధించి చరిత్ర సృష్టించింది. పంజాబ్‌ విశ్వవిద్యాలయం నుండి రాజనీతి శాస్త్రంలో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసిన కిరణ్‌ బేడి ఢిల్లీ ఐఐటీ సోషల్‌ సైన్సెస్‌ విభాగం నుండి డాక్టరేట్ కూడా పూర్తి చేసింది. ఢిల్లీ డిప్యూటీ కమీషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ (ట్రాఫిక్‌) గా ధైర్యసాహసాలతో తన బాధ్యతలను నిర్వహించింది. 9 వేల మంది ఖైదీలున్న తీహార్‌ జైలకు బదిలీ అయ్యాక అక్కడ ఖైదీల పట్ల సేవాదృ క్పథాన్ని ప్రదర్శించింది. ఎన్నో సంస్కరణలు చేసింది. ఈమె సేవలకు గుర్తింపుగా 1994లో రామన్‌ మెగసెసే అవార్డు లభించింది. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శికి పౌర పోలీస్‌ సలహాదారుగా నియమింపబడిన తొలి మహిళ కిరణ్‌ బేడీ నే కావడం విశేషం. ‘ఐ డేర్‌’ పేరుతో తన ఆత్మకథను కూడా రాసుకున్నారు కిరణ్‌ బేడీ.

సాధించిన అవార్డులు
1979 : రాష్ట్రపతి గ్యాలెంటరీ అవార్డు
1980 : విమెన్ ఆప్ ది ఇయర్ అవార్డ్
1991 : మత్తుపదార్థాల నివారణ, నిర్మూలన వారి ఆసియా స్థాయి అవార్డు
1994 : మెగ్సేసే అవార్డు (ప్రభుత్వ రంగంలో )
1995 : మహిళా శిరోమణి అవార్డు
1995 : లయన్ ఆప్ ది ఇయర్ అవార్డు
1999 ; ప్రైడ్ ఆప్ ఇండియా అవార్డు
2005 : మదర్ థెరీసా జాతీయ స్మారక అవార్డు (సాంఘిక న్యాయం)

రచనలు:
Kiran Bedi (1985) – Demand for Swaraj (1905–1930)
Kiran Bedi; Parminder Jeet Singh; Sandeep Srivastava (2001) – New Governance Opportunities for India.
Kiran Bedi; T M Dak (1 January 2005) – What Went Wrong?
Kiran Bedi (2006). It’s Always Possible: One Woman’s Transformation of Tihar Prison.
Kiran Bedi (2006) – Galti Kiski (in Hindi).
Kiran Bedi (2006) – Yeha Sambhav Hai (in Hindi)
Kiran Bedi (2008) – Empowering Women… As I See…
Kiran Bedi (2008) – Leadership & Governance…
Kiran Bedi (2008) – Indian Police… As I See….
Kiran Bedi; Pavan Choudary (2010) – Broom & Groom. Wisdom Village.
Kiran Bedi (2012) – Dare to Do, for the New Generation
Kiran Bedi; Pavan Choudary (2013) – Indians Against Corruption.
Kiran Bedi;(2016) – Creating Leadership..