Fashion

పాలతో ఎండ నుండి రక్షణ

TNILIVE Fashion News || Milk Pack For Skin Care In Summer

ఉష్ణోగ్రతలు బాగా పెరుగుతున్నాయని, అవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. బయటకు వెళ్లడం తప్పదనుకుంటే చర్మాన్ని కాపాడుకోవడానికి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఎండకు వెళ్తే అనేక రకాల సమస్యలు వస్తాయి. ముఖ్యంగా స్కిన్ దెబ్బతింటుంది. స్కిన్ పై సన్టాన్, దద్దుర్లు, కమిలిన మచ్చలు, చర్మం పొడిబారడం వంటివే కాకుండా స్కిన్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. మరి ఇటువంటి సమస్యలు రాకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి.

ఎండకు స్కిన్ ఫోకస్ కాకుండా వీలైనంత వరకు కప్పుకోవాలి. దీంతో ఎండ నేరుగా స్కిన్ పై పడదు. ముఖ్యంగా ముఖం ఎండకు బాగా ఫోకస్ అవుతుంది. అటువంటప్పుడు ఆడవాళ్లు స్కార్ఫ్ తో, మగవాళ్లు క్యాప్, కర్చీఫ్ తో ముఖాన్ని కప్పుకోవాలి. అయితే ముఖాన్ని కప్పి ఉంచే క్లాత్ కాటన్ దే అయి ఉండాలి. పాలిస్టర్ క్లాత్ మరిన్ని సమస్యలు తెచ్చిపెడుతుంది. అంతే కాకుండా మరీ గట్టిగా కాకుండా ఊపిరి బాగా ఆడేలా కట్టుకోవాలి. వీకెండ్స్​లో స్కిన్ కేర్ పై దృష్టిపెట్టాలి. సన్ టాన్ తొలగించుకోవడానికి కెమికల్స్​ లేనటువంటి నేచురల్ ఫేస్ ప్యాక్ లను వేసుకోవాలి. చల్లని పాలు, క్రీమ్, సన్ స్క్రీన్ లోషన్లు సమ్మర్ లో చాలా బాగా పనిచేస్తాయి. శరీరంలో నీటిశాతం తగ్గకుండా చూసుకోవాలి.