Food

చపాతీ ప్రియులు ఇది చదవండి

చపాతీ ప్రియులు ఇది చదవండి

ఊబకాయంతో బాధపడేవారు, లావు తగ్గాలని కోరుకునే వారు రాత్రి సమయంలో అన్నం మానెయ్యటం మంచిదే. కాని దీనికి బదులు చపాతీలు తినటానికి ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. రాత్రి సమయంలో మనం పని చేయం. నిద్ర పోతాం. దీంతో జీర్ణవ్యవస్థకు విశ్రాంతి ఇవ్వటం ఎంతైనా అవసరం. లేదంటే జీర్ణప్రక్రియ మందగిస్తోంది. వైద్యులు కూడా ఈ మధ్యకాలంలో చపాతీలు తినమని సూచిస్తున్నారు. దీంతో ఎక్కువ మంది దీనివైపు మొగ్గు చూపుతున్నారు. అయితే చపాతీలు తినేవారు కొన్ని విషయాలు తెలుసుకోవాలి.
* చపాతీని తక్కువ నూనెతో కాల్చడం వల్ల ఉపయోగాలు మరింత ఎక్కువగా ఉంటాయి. అసలు నూనె వేయకుండా ఉంటే మరింత మంచిది.
* ప్లేటు నిండుగా భోజనం చేసినా ఒకటే, రెండు లేదా మూడు చపాతీలు తిన్నా ఒక్కటేనని వైద్యులు కూడా చెబుతున్నారు. అన్నం కంటే చపాతీ శరీరానికి అధిక శక్తినిస్తుందని నిరూపితం అయ్యింది.
* శక్తిని ఇస్తున్నంత మాత్రాన ఈ చపాతీల్లో కొవ్వు పదార్థాలు ఉండవు. ఎందుకంటే గోధుమల్లో ఎలాంటి కొవ్వు పదార్థాలు ఉండవు. వాటిల్లో విటమిన్ బి,ఇ, కాపర్, అయోడిన్, జింక్, మాంగనీస్, సిలికాన్, మెగ్నీషియం కాల్షియం వంటి ఎన్నో ఖనిజాలు ఉంటాయి. గోధుమల్లో ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది.
* పని ఒత్తిడిలో ఏ అర్ధరాత్రి భోజనం చేసి వెంటనే కునుకు తీస్తుంటారు. కానీ ఈ విధంగా చేయడం ఆరోగ్యానికి హానికరం. భోజనం చేయడానికి, నిద్ర పోవడానికి మధ్య గ్యాప్ ఉంటే మంచిది.
* అలా చేయలేని వారికి చపాతీ తీసుకోవడం ఉత్తమం. చపాతి కూడా ఎక్కువగా తినకూడదు.
* ప్రతిరోజూ మోతాదుకు మించి తీసుకోవటం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
* జంక్‌ఫుడ్ తినటానికి దూరంగా ఉండవచ్చు. ఉదయానే్న అల్పాహారంగా తీసుకోవటంతో రోజంతా చురుకుగా ఉండవచ్చు. అవసరమైన న్యూట్రీషన్లు కూడా లభిస్తాయి.