Devotional

తిరుమల టోకెన్లు 14వ తేదీ వరకు అయిపోయాయి

తిరుమల టోకెన్లు 14వ తేదీ వరకు అయిపోయాయి

తిరుమలలో శ్రీవారి దర్శన టికెట్ల కోసం భక్తులు పోటెత్తారు..

◆నేడు స్థానికులకు తితిదే అవకాశం కల్పించడంతో భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చారు.

టికెట్లు ఉన్నవారికే దర్శనం కల్పించాలని తితిదే నిర్ణయించడంతో పెద్ద సంఖ్యలో వచ్చారు…

◆తిరుపతిలోని విష్ణునివాసం, శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్సు వద్ద తెల్లవారు జామున 3 గంటల నుంచే భక్తులు బారులు తీరారు.

రేపటి కోటా ముగిసినా భక్తులు భారీగా క్యూలైన్లలో వేచి ఉండటంతో ఈనెల 14వరకు ఉన్న కోటాను సైతం తితిదే విడుదల చేసింది..

◆టికెట్లు పొందిన భక్తులకు రేపటి నుంచి దర్శనభాగ్యం కల్పించనున్నట్టు తితిదే తెలిపింది.

◆రోజుకు 6వేల మందినే శ్రీవారి దర్శనానికి అనుమతిస్తున్నారు.

◆టిక్కెట్లు కలిగిన వారిని మాత్రమే కొండపైకి అనుమతించనున్నారు..

నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.26లక్షలు వచ్చినట్టు అధికారులు వెల్లడించారు..

◆తిరుపతిలోని ఆయా కౌంటర్లలో ఆధార్‌కార్డుతో పాటు ఐరిస్‌ ద్వారా టోకెన్‌ పొందిన భక్తులు.. మరునాడు నిర్దేశించిన సమయానికి తిరుమలలోని వైకుంఠం క్యూకాంప్లెక్స్‌కు చేరుకోవాలని తితిదే సూచించింది.

కాలినడక భక్తులకు ప్రత్యేక కోటా లేదు..