Health

శోభనం రోజు గులాబీపూలు తింటే….

శోభనం రోజు గులాబీపూలు తింటే….

గులాబీ పూలని తింటే వీర్యవృద్ధి అవుతుందా.. శోభనపు గదిని ఎందుకు వీటితో అలంకరిస్తారు..

గులాబీ పూలు అనగానే ప్రేమకు గుర్తుగా భావిస్తారు. వీటిని అందానికి, అలంకరణకి మాత్రమే కాదు.. ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయి.. ఆ ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం..

రోజూ పూలు.. ఒక్క పువ్వు ప్రేమించే వారికి ఇస్తే చాలు ఫిదా అవుతారు. అందుకే వీటిని ఇచ్చి వారి ప్రేమను తెలియజేస్తుంటారు. ఇక అమ్మాయిలైతే ఈ పూలకి దాసోహం అంటారు. జడలో పెట్టుకుని మురిసిపోతారు. వీటితో పాటు డెకరేషన్స్‌లోనూ పూలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. అయితే, పూలల్లో అందం, అలంకరణకి సంబంధించినవి మాత్రమే కాదు.. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ కూడా దాగి ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం..

పూరేకుల్లోని విటమిన్స్..

రోజా పూలల్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది చర్మాన్ని తాజాగా, అందంగా మారుస్తుంది. అంతేకాదు.. ఈ పూలల్లో ఒత్తిడిని మాయం చేసే గుణాలు ఉన్నాయి. అందుకే ఏదైనా డిప్రెషన్‌గా అనిపించినప్పుడు ఈ పూల వాసన చూస్తే చాలు.. క్షణాల్లో అందంగా మారుతారు.

బరువు తగ్గడం..

ఈ పూరేకులని తింటారు కూడా.. వీటిని తినడం వల్ల ముఖ్య ప్రయోజనాల్లో బరువు తగ్గుతారని చెబుతున్నారు నిపుణులు.. అయితే, వీటిని డైరెక్ట్‌గా తినలేని వారు.. ఇతర ఆహార పదార్థాలతో కలిపి తినొచ్చు.. అంటే సలాడ్స్, కలిపి తీసుకోవచ్చు. రోజా పూ రేకుల్లో మెటబాలిజం చక్కగా పనిచేస్తుంది.. వీటిని తినడం వల్ల అన్ని అవయవాల పనితీరు మెరుగవుతుంది.

మైగ్రేన్ దూరం..

చాలా మంది మైగ్రేన్ తలనొప్పితో బాధపడుతుంటారు. అలాంటి వారు రోజ్ ఆయిల్‌తో మసాజ్ చేస్తే సమస్య దూరం అవుతుంది.

వీర్య వృద్ధి..

రోజూ పూల రేకులను గుప్పెడు తింటే అవి శరీరంలోని వ్యర్థాలను తొలగిస్తారియ. ఈ కారణంగా రక్తశుద్ధి జరుగుతుంది. వీటిని తినడం వల్ల వీర్యవృద్ధి జరుగుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల శృంగార సమస్యలు, సంతాన సమస్యలు దూరం అవుతాయి. కాబట్టి మగవారు వీటిని తినడం మంచిదని చెబుతున్నారు..

వీటితో పాటు.. బెడ్ రూమ్‌ని అలంకరించడంలోనూ ఇవి ప్రముఖ పాత్ర పోషిస్తాయి. అందుకే శోభనపు గదులను వీటిని అలంకరిస్తారు. ఈ వాసన నూతన దంపతుల్లో ఒత్తిడిని దూరం చేసి ఒకరికి ఒకరు దగ్గరయ్యేందుకు సహకరిస్తాయి.

ఇక రోజా పూలల్లోని విటమిన్ సి పాడైన కణణాలను బాగు చేస్తాయి. వీటిని తినడం వల్ల వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అంతేనా… రుతు సమస్యలతో బాధపడేవారు వీటిని తినడం వల్ల సమస్య పరిష్కారం అవుతుంది.

వీటితో పాటు ఈ గులాబీ పూరేకులతో ఇంట్లోనే మనం రోజ్ వాటర్‌ని తయారు చేసుకోవచ్చు. అందుకోసం ఓ గుప్పెడు పూ రేకులని తీసుకుని చక్కగా కడిగి ఓ గిన్నెలో వేసి నీటిని పోసి ఉంచాలి.. ఓ రాత్రంతా అలానే ఉంచాలి.. ఇప్పుడు ఆ నీటిని ఓ కంటెయినర్‌లో పోసుకుని ఫ్రిజ్‌లో పెట్టుకోండి. ఇవి ఓ వారం వరకూ హ్యాపీగా వాడుకోవచ్చు.

అయితే, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే గులాబీ రేకులని తినే ముందు వాటిని శుభ్రంగా కడిగి తినడం మంచిది. ఎందుకంటే వీటిపై చల్లే పురుగు మందులు శరీరంపై ప్రభావం చూపుతాయి.