NRI-NRT

యూకె-కువైట్‌లలో బాలయ్య జన్మదిన వేడుకలు

UK kuwait Fans Celebrate Balakrishna's 60th Birthday

అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ 60వ జన్మదిన వేడుకలను కువైట్‌లో ఘనంగా నిర్వహించారు. లాక్‌డౌన్‌ కారణంగా ఇబ్బందులు పడుతున్న తెలుగువారికి ఈ సందర్భంగా సాయం చేశారు. సాల్మియా, ఒమేరియా, అబు హలిఫా, సబాహియా, ఫహాహీల్, మంగాఫ్ తదితర ప్రాంతాల్లో ఉన్న తెలుగువారికి రేషన్‌ పంపిణీ చేశారు. నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు వేడుకలు యూకేలోనూ ఘనంగా జరిగాయి. మాంచెస్టర్‌లో తమ అభిమాన నటుడి 60వ జన్మదిన వేడుకలను ఎన్నారై తెదేపా ఆధ్వర్యంలో అభిమానులు ఉత్సాహంగా జరుపుకొన్నారు.
UK kuwait Fans Celebrate Balakrishna's 60th Birthday