Fashion

పట్టీలతో పురిటి నొప్పులు పోతాయా?

పట్టీలతో పురిటి నొప్పులు పోతాయా?

కాళ్ళకి పట్టీలు కేవలం అందానికి మాత్రమే పెట్టుకుంటారని చాలా మంది అనుకుంటారు. కానీ, వీటి వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు.మీరు ఫ్యాషన్ కోసం పెట్టుకుంటున్నా, మీకవి కొనిపెట్టిన వాళ్ళ కోసం పెట్టుకుంటున్నా పట్టీలు పెట్టుకోడం వల్ల ఉండే హెల్త్ బెనిఫిట్స్ తెలిస్తే ఇంకా ఆనందిస్తారు.
1. పాజిటివ్ ఎనర్జీ
మన కాళ్ళూ చేతుల నించి ఎప్పుడూ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఈ ఎనర్జీ మనకి పాజిటీవ్ వైబ్రేషన్స్ తీసుకొస్తాయి. మనం చెప్పులు లేకుండా నేల మీద నిల్చున్నప్పుడు భూమి నుంచి కూడా కొంత ఎనర్జీ మనకి వస్తుంది. శరీరం మీద వెండి ఉండటం వల్ల ఆ ఎనర్జీ పాజిటివ్ గా ఉంటుంది. ఇంట్లో చెప్పులు లేకుండా నడిచే స్త్రీలు తప్పనిసరిగా వెండి పట్టీలు పెట్టుకోవాలి.
2. పాదాల వాపు దూరం..
పాదానికి ఎప్పుడూ రాసుకుంటూ ఉండే పట్టీల వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది. అందువల్ల పాదాల వాపు తగ్గుతుంది. ఎముకలు బలహీనంగా ఉన్న వారికి ఈ పాదాల నొప్పి పైవరకూ పాకుతుంది. రెగ్యులర్ గా వెండి పట్టీలు పెట్టుకోవడం వల్ల ఈ సమస్యని తగ్గించవచ్చు.
3. యాంటీ-బాక్టీరియల్ ప్రాపర్టీస్
పట్టీలు పెట్టుకుని నడిచేటప్పుడు వచ్చే మువ్వల చప్పుడు ఇంట్లోని నెగెటివ్ ఎనర్జీని బయటికి పంపుతుందని అంటారు. దానికి తోడు వెండికి ఉండే యాంటి-బాక్టీరియల్ ప్రాపర్టీస్ వల్ల ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది.
4. గైనిక్ ప్రాబ్లమ్స్ రాకుండా..
స్త్రీలు సాధారణంగా ఫేస్ చేసే హార్మోనల్ ఇన్‌బ్యాలెన్స్, పీరియడ్స్ సరిగా రాకపోవడం వంటివి వెండి పట్టీలు రెగ్యులర్ గా పెట్టుకోవటం వల్ల రాకుండా ఉంటాయి. గర్భవతులు తప్పనిసరిగా వెండి పట్టీలు పెట్టుకోవాలని అంటారు. దాని వల్ల ప్రసవ సమయం లో వచ్చే నొప్పి బాగా తగ్గుతుందట.21వ శతాబ్దానికి ముందు బ్రేస్‌లెట్స్‌ని కాళ్ళకి పెట్టేవారు. ఆ తర్వాత వెండి పట్టీలు ఫ్యాషన్ అయిపోయింది. మన సంస్కృతిలో ఇవిఎన్నో తరాల నుంచి భాగమైపోయాయి. ప్రాచీన సంస్కృతులన్నిటిలో కాలికి కూడా ఏదైనా ఆభరణం ధరించడం కామన్‌గా ఉండేది.
***కాలి పట్టీలు అంటే వెండి మాత్రమే కాదు.. ఎన్నో రకాల లోహలతో చేస్తారు. వాటిని బట్టి ఆ స్త్రీ ఆర్ధిక పరిస్థితిని అంచనా వేసేవారు. బాగా డబ్బున్న వారైతే.. బంగారపు పట్టీలు పెట్టుకునేవారు. అంత కంటే కొద్దిగా తక్కువ ఆస్తి ఉంటే వెండి పట్టీలు, మిగిలిన వాళ్ళు రాగి తోనూ, ఇత్తడి తోనూ చేసిన పట్టీలు పెట్టుకునేవారు. కొన్ని చోట్ల పెళ్ళైన వాళ్ళు మాత్రమే పట్టీలు పెట్టుకునేవారు. ఎందుకంటే, పట్టీల చప్పుడు ఘల్లు ఘల్లు మని వినిపించగానే మగవారు జాగ్రత్తపడేవారట – పెళ్లైనవారు వస్తున్నారు.. మనం గౌరవించాలి అని. నాట్య కళాకారిణులు బాగా ఎక్కువ మువ్వలుండే పట్టీలు పెట్టుకుంటారు…ఎక్కువ చప్పుడు రావడం కోసం.