DailyDose

యనమల చినరాజప్పలపై కేసు నమోదు-నేరవార్తలు

మాజీ మంత్రి చినరాజప్పపై మహిళ కేసు-నేరవార్తలు

* మాజీ మంత్రులు యనమల, చిన రాజప్పలపై ఓ మహిళ ఎస్పీకి ఫిర్యాదు చేసింది.తన భర్తకు రెండో పెళ్లి చేయించేందుకు వారిద్దరు ప్రయత్నించారని ఆరోపించింది.మాజీ టీడీపీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మీ కుమారుడు రాధకృష్ణతో తొమ్మిదేళ్ళ క్రితం తనకు ప్రేమ వివాహమైందని..ఇద్దరు పిల్లలు ఉన్నారని బాధితురాలు చెబుతోంది.కొంత కాలంగా తన భర్తని కాపురానికి పంపకుండా వేధించడంతో మార్చి 10న ఇంద్రపాలెం పోలీసు స్టేషన్‌లో అత్తమామలపై ఫిర్యాదు చేసింది.ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.

* విద్యార్థులను బానిసలుగా చేస్తున్న గంజాయి అమ్మే వ్యక్తులను పట్టుకున్న కంచికచర్ల పోలీసులు…వివరాల్లోకి వెళితే కంచికచర్ల చెక్ పోస్ట్ వద్ద కారులో తర ఇస్తున్న 300గ్రాముల గంజాయి పట్టుకొని ..దర్యాప్తు ప్రారంభించిన కంచికచర్ల పోలీసులకు ఏజెన్సీ ప్రాంతాల నుంచి ఈ గంజాయిని తరలిస్తున్న ట్లుగా గుర్తించి….మైలవరం మండలం అనంతవరం గ్రామానికి చెందిన రేవంత్ చౌదరి వ్యక్తి ద్వారా నందిగామ మైలవరం ఇబ్రహీంపట్నం ప్రాంతాల్లోగంజాయి సరఫరా చేస్తున్నట్లు గుర్తించామని జిల్లా ఎస్పీ తెలిపారు.

* అమడగూరు మండలం టి.పుట్లవాండ్లపల్లి లో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకోని మృతి చెందినాడు. వివరాలు ఇలా గాండ్లపెంట మండలం కటారుపల్లి గ్రామానికి చెందిన ఓబుళ రెడ్డి కుమారుడు వంశేఖర రెడ్డి (16) వాళ్ల తాతాయ్య మస్తాన్ రెడ్డి దగ్గరే వుంటున్నాడు.

* ఈఎస్‌ఐ స్కామ్‌లో అరెస్ట్‌ అయిన కింజరాపు అచ్చెన్నాయుడుకి జైలు అధికారులు ఖైదీ నెంబర్‌ 1573 కేటాయించారు. ప్రస్తుతం విజయవాడ జైలులో ఉన్న ఆయన్ని న్యాయమూర్తి ఆదేశాల మేరకు గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు.

* దాచేపల్లి మండలం పొందుగల చెక్ పోస్ట్ వద్ద తెలంగాణ నుండి ఆంధ్రాకు లారీలో తరలిస్తున్న 500 బాటిళ్లు (10 కేసులు) అక్రమ మద్యం పట్టుకున్న దాచేపల్లి పోలీసులు.

* పెదనందిపాడు లో కన్న కూతురు పై అత్యాచారానికి పాల్పడిన కసాయితండ్రిని పొన్నురు రాం నగర్ వద్ద అరెస్ట్.నిందితుడను కోర్టుకు హాజరు పరిస్తున్నామని డిఎస్పీ ఏ శ్రీనివాసరావు పేర్కొన్నారు.యళిచర్ల ఏలియా స్/0 ప్రకాశం 07.06.2020 కన్న కూతురు పై హత్యాచారం 08.06.2020 వెలుగులోకి వచ్చింది.కేసు నమోదు 12.06.2020 పరారీలో ఉన్న కసాయి తండ్రి అరెస్ట్ 13.06.2020 న కోర్టుకు అప్పగింత.