WorldWonders

ఒకేరోజు ఒకే పెళ్లికూతురు…రెండు పెళ్లిళ్లు

ఒకేరోజు ఒకే పెళ్లికూతురు…రెండు పెళ్లిళ్లు

నల్గొండ జిల్లా కనగల్ మండలంలో వింత ఘటన చోటుచేసుకుంది. ముందుగా పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్న మౌనిక అనే ఓ యువతి.. మర్నాడు తాను మనసిచ్చిన యువకుడిని మనువాడింది.కనగల్ మండలం శాబ్దుల్లాపూర్ గ్రామానికి చెందిన మౌనికకు దేవరకొండకు చెందిన ఓ యువకుడితో పెద్దలు పెళ్లి నిశ్చయించారు. ఈనెల 12న వారి వివాహం కూడా జరిగిపోయింది.అప్పుడే అసలు కథ మొదలైంది. మౌనిక తనకు వరుసకు మామయ్య అయ్యే రాజేశ్​తో గత కొన్నేళ్లుగా ప్రేమాయణం సాగిస్తోంది. ఈ విషయం తెలియని కుటుంబ సభ్యులు మౌనికకు మరో వ్యక్తితో వివాహం నిశ్చయించారు. ప్రేమ విషయం పెద్దలకు చెప్పే ధైర్యం లేని మౌనిక పెళ్లికి అంగీకరించింది. వివాహమూ చేసుకుంది.కట్​చేస్తే పెళ్లయిన కాసేపటికి అక్కడికి రాజేశ్​ వచ్చాడు. అతడిని చూసిన మౌనిక.. వెంటనే అతడిని గట్టిగా పట్టుకుని ఏడ్చేసింది. ఫలితంగా మౌనికను వివాహమాడిన యువకుడు పెద్దల ముందు పంచాయతీ పెట్టాడు. రంగంలోకి పోలీసులూ దిగారు. పలు చర్చల తర్వాత తాము ఈ పెళ్లిని రద్దు చేసుకుంటున్నామని మగ పెళ్లివారు తేల్చి చెప్పారు. దాంతో ఈనెల 13న రాజేశ్​, మౌనికలు మళ్లీ వివాహం చేసుకున్నారు.