DailyDose

పోస్టుమార్టంలో కరోనా పాజిటివ్-TNI బులెటిన్

పోస్టుమార్టంలో కరోనా పాజిటివ్-TNI బులెటిన్

* సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని శాంతినగర్ కు చెందిన ఓ మహిళ గుండెపోటుతో హైదరాబాద్ లోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో మృత్తి చెందగా అక్కడ ఆస్పత్రి సిబ్బంది సంపిల్స్ సేకరించి టెస్ట్ నిర్వహించగా మృతురాలికి కరోన పాజిటివ్ తేలగ 9-06-2020 నాడు ఆమె అంతక్రియాల్లో పాల్గున్న కుటుంభ సబ్యులతో పాటు వారితో దగ్గర పరిచయాలు ఉన్నవారికి మొత్తం 25.మంది ని మిర్జాపూర్ లోని కమినిటీ హెల్త్ కేర్ లో కొరైన్ టైన్ లో ఉంచి పరీక్షలు నిర్వహించాగ 19 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో వారిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. మీగిత 6 గురికి హోమ్ కరైన్ టైన్ లో ఉండాలని సూచించారు ఏకంగా 19.మందికి వ్యాధి సోకడంతో జహీరాబాద్ ప్రాంతంలో కలకలం రేపింది.అధికారులు పట్టణంలోని శాంతినగర్ ను పూర్తిగా రాకపోకలను నిలిపేసి రెడ్ జోన్ గా ప్రకటించారు.దింతో పాటు రాయికోడ్ మండల్ హుల్గెరా గ్రామానికి చెందిన 55.వ.సంవత్సరల మహిళ కు కరోన వ్యాధి నిర్ధారణ కావడం తో అధికారులు అప్రమత్తం అయ్యారు.

* 24 గంటల్లో కొత్తగా 294 కరోనా కేసులు: 2 మరణాలు. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 294 కరోనా కేసులు.

* దేశ రాజధాని ఢిల్లీలో వైరస్‌ ఉధృతి రోజురోజుకు పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా నేతృత్వంలో సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌, ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజల్‌, ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం అధికారులు పాల్గొన్నారు. 

* తెలంగాణ సచివాలయ ఉద్యోగులను కరోనా కలవరపెడుతోంది. సచివాలయ కార్యకలాపాలు నిర్వహిస్తున్న బీఆర్కే భవన్‌లో మరొకరికి కరోనా సోకింది. ఐటీ శాఖలో పనిచేస్తున్న పొరుగుసేవల సిబ్బందిలో ఓ మహిళా ఉద్యోగికి వైరస్​ నిర్ధరణ అయింది. గత ఐదు రోజులుగా సదరు ఉద్యోగి విధులకు హాజరు కావడం లేదు.