Agriculture

మిడతల దండును ఇలా పారద్రోలవచ్చు

మిడతల దండును ఇలా పారద్రోలవచ్చు

అడవి మిడతలు.. పంటలను తిని మనకు తీవ్ర నష్టం కల్గిస్తాయి. మార్చి, ఏప్రిల్‌లో ఆఫ్రికా, ఇరాన్‌, పాకిస్తాన్‌లోని ఎడారి ప్రాంతాల్లో ఉన్న ఈ మిడతలు.. సంతానోత్పత్తి ద్వారా వృద్ధి చెంది ప్రస్తుతం మన దేశంలోకి ప్రవేశించాయి. ప్రస్తుతం మన రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న ఈ మిడతలు మన ప్రాంతంలోకి వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ముందే అవగాహన కల్గి ఉండడం అవసరం. ఈ మిడతలు మన ప్రాంతంలో ఉండవు. కానీ వేరే ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి పంటలను తిని వేరే ప్రాంతానికి వెళతాయి. ఈ మిడతలకు రెక్కలు లేకపోయినా గాలివాటుగా సముద్ర మట్టానికి రెండు కిలోమీటర్ల ఎత్తులో దండులా వేరే ప్రాంతానికి ఎగురుతూ వెళ్లగలవు. ఇవి ఎడారి ప్రాంతాల్లోనే అధికంగా ఉంటాయి. కానీ తిండికి, గుడ్లు పెట్టేందుకు ఇతర ప్రాంతాలకు వెళతాయి. దారిలో దొరికి పంటలను తిని నాశనం చేస్తాయి.

*** ఇది మన దేశంలోనే ఉంటుంది. ఆకుపచ్చ రంగులో ఉండి పసుపు గీతలు ఉంటాయి. ఇవి కేవలం జిల్లేడు మొక్కలపైనే ఉంటాయి. వేరే రకాల మొక్కలు లేదా పంటలపైకి రావు. వీటి ముఖం మీద, పొట్ట దగ్గర తాకితే ఒక రకమైన ద్రావణాన్ని చిమ్ముతాయి.

*** ఈ రకమైన మిడత మనదేశంలో అన్ని రకాల మొక్కలపై కనిపిస్తుంది. ఇవే కాకుండా మనకు కనిపించే అనేక రకాల మిడతలు గడ్డిలో ఉంటూ పెద్దగా నష్టంను కలిగించవు.

*** మిడతల నివారణ
ఖాలీ డబ్బాలతో పెద్ద శబ్దాలు చేస్తే పారిపోతాయి.
పొలంలో రెండడుగుల గుంత తీసి అక్కడి నుంచి నాలుగడుగుల లోతు వరకు ఉన్న మట్టిని (ఈ మట్టిలో బంక ఎక్కువగా ఉంటుంది) తీసి 200 లీటర్ల నీటి డ్రమ్ములో మూడు లేదా నాలుగు తట్టల మట్టి ( 30-40 కిలోలు) పది నిమిషాల పాటు బాగా కలియతిప్పాలి. ఆ బురద నీటిని వడకట్టి పంటలపై మొక్కలు బాగా తడిసేలా పిచికారీ చేయాలి. అలా చేయడం వల్ల ఆ పంటలను మిడతలు తినలేవు. మిడతలకు కాలేయం ఉండదు కాబట్టి మట్టిని తింటే అవి జీర్ణం చేసుకోలేక చనిపోతాయి.
15 లీటర్ల నీటిలో 45 మి.లీల వేపనూనె కలిపి పంట మీద చల్లితే ఆ పంటను మిడతలు తినలేవు
క్వినాల్‌పాస్‌ 1.5 మి.లీలు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి
టపాకాయలు పేల్చితే ఆ శబ్ధానికి అవి పారిపోతాయి.
గుగ్గిలం, ఊదులాంటి వాటితో పొగ వేయడం వల్ల పారిపోతాయి.