Agriculture

రాయలసీమలో రెండు భారీ వజ్రాలు లభ్యం

రాయలసీమలో రెండు భారీ వజ్రాలు లభ్యం

ఆప్రాంతంలో తొలకరి జల్లులు పడితే చాలు భూమి నుండి వజ్రాలు బయటకు వస్తాయి.వజ్రాల పంటలే పండుతాయి.అవునండి నిజం రాయలసీమ ప్రాంతమైన ఆ ప్రాంతంలో వర్షం పడితే చాలు వజ్రాలు నేలను చీల్చుకొని ఆకాశం వైపు చూస్తాయి.పట్టపగలే నక్షత్రాలను తలపిస్తాయి.

వాయిస్ …రాయలసీమ ప్రాంతమైన కర్నూల్ జిల్లా తుగ్గలి మండలం లో తొలకరి జల్లులకు వజ్రాలు దొరుకుతూ ఉంటాయి.ఇక్కడి వజ్రాలను వేతకడానికి చుట్టుపక్కల ప్రాతలనుండే కాకుండా వేరే రాష్ట్రాల నుండి సైతం వజ్రాల వేటకు ఇక్కడికి వస్తుంటారు.

నిన్న పగిడిరాయి గ్రామంలో రైతు పొలం పనులు చేస్తుండగా లక్ష రూపాయలు విలువ చేసే వజ్రం లభించింది. అదే రోజు బొల్లావాని పల్లెలో ఒక గొర్రెల కాపరికి లక్ష 50,000 వేలు విలువచేసే వజ్రం దొరికింది. ఈ వజ్రాలను పెరవలి,జొన్నగిరి గ్రామాల వ్యాపారస్తులు కొనుగోలు చేశారు.

తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాడానికి రాష్ట్రాలు, జిల్లాలు, దాటి వచ్చి కొద్దీ రోజులు అక్కడే మకాం వేసి తమ వజ్రాల అన్వేషణను కొనసాగిస్తుంటారు. దొరికిన వారు సంతోషంతో వెళుతుంటారు. దొరకనివారు మరల మరల వజ్రాలను వెతుకుతూనే ఉంటారు.