Politics

పటిష్ఠంగా కోవిద్-19 నివారక ఏర్పాట్లు

పటిష్ఠంగా కోవిద్-19 నివారక ఏర్పాట్లు

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్‌ సమావేశాలపై స్పీకర్‌ తమ్మినేని సీతారాం అధ్యక్షతన సోమవారం ఉన్నతస్థాయి సమావేశం..

◆ఈ సమీక్షలో అసెంబ్లీ నిర్వహణ, భద్రతపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

◆శాసన మండలి చైర్మన్ షరీఫ్‌, మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, డీజీపీ గౌతమ్ సవాంగ్, వైద్య శాఖ సెక్రటరీ జవహర్ రెడ్డి, చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, విప్లు శ్రీనివాసులు, ఉదయభాను, కాపు రామచంద్రారెడ్డి, పోలీస్‌ ఉన్నతాధికారులు, పలు శాఖ అధికారులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా స్పీకర్‌ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ.. కొవిడ్‌ నేపథ్యంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు.

◆అసెంబ్లీ,మండలిలోని ప్రతి సీటును శానిటేషన్‌ చేస్తున్నామన్నారు.

◆సభ్యులందరికీ వైద్య పరీక్షలు నిర్వహించడానికి ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు.

◆భద్రత ను కట్టు దిట్టం చేసి సభ్యులు మినహా ఎవ్వరిని అనుమతించకూడదని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.

గవర్నర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగిస్తారని వెల్లడించారు..

◆శాసన సభ్యుల సిబ్బందికి బయట ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.

◆భౌతిక దూరం పాటించి సమావేశాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామని స్పీకర్‌ వెల్లడించారు. 

ప్రత్యేక పరిస్థితుల్లో అసెంబ్లీ సమావేశాలు:శ్రీకాంత్‌రెడ్డి

◆అసెంబ్లీ సమావేశాలను ప్రత్యేక పరిస్థితుల్లో నిర్వహిస్తున్నామని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు.

◆రాష్ట్రంలో తొలిసారిగా ఇలా నిర్వహిస్తున్నామని వెల్లడించారు.

◆రేపు ఉదయం 10 గంటలకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయన్నారు.

◆గవర్నర్‌ ప్రసంగం అనంతరం బీఏసీ సమావేశం నిర్వహిస్తామని తెలిపారు.

◆సభ ఎన్ని రోజులు జరగాలన్నది బీఏసీలో నిర్ణయిస్తామని వెల్లడించారు.

◆ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కరోనా పరీక్షలు నిర్వహించేందుకు వీలుగా ఏర్పాట్లు చేశామని శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు.