Editorials

బాగున్నారా అంటే ఏమిటి?

TNILIVE Editorials || The real meaning of checking on others in Telugu

పరిచయం ఉన్నవారు ఎదురైతే- ‘బాగున్నారా’ అని పలకరిస్తారు బావున్నా మండీ అంటూ నవ్వుతూ బదులిస్తాం. నిజంగా బాగున్నారా.. తెలియదు

బావుండటమంటే ఏమిటి? వైద్యశాస్త్రం ప్రకారం ఆరోగ్యంగా ఉండటమనే అను కొంటాం! కానీ ఆరోగ్యంగా ఉండటం కుశలంగా ఉండటం సమానం కాదని ఆయు ర్వేదానికి పరిపూర్ణత సాధించి పెట్టిన చరకుడు వివరించారు శారీరకంగా దృఢంగా ఉండటమొక్కటే సౌర్యం కాదు.. మానసికంగా ఆధ్యాత్మికంగా మూర్తిమంతమై కనిపించడమే బావుండటం. ఎందరో భౌతికంగా స్వస్థత కలిగినవారుగా కనిపిస్తారు. కానీ అంతర్గతంగా దుర్భల రై ఉంటారు

లోలోపల బావున్నామనే భావన వారిలో కనిపించదు

మనం సాధించాలని అనుకున్నవన్నీ ఏదో అనిర్వచనీయమైన దౌర్బల్యంతో సాధించలేని పరిస్థితులు ఉండవచ్చు. అంతర్గతంగా కుశలంగా ఉన్నామని, శరీరం ప్రాణం ఏకమై ఉందనే అనుభూతి మనిషి ఆరోగ్యవంతమైన జీవితానికి ఆవసరం. అప్పుడే జీవనం సౌఖ్యంగా సాగుతుంది. మనిషిలోని సత్తువ త్రాణ మానసికంగా శారీరకంగా సమంగా ఉంటే… నిర్ణయించుకున్న లక్ష్యంవైపు పయనం సులువవుతుంది.

మనకు ఎదురయ్యే అన్ని శారీరక వైకల్యాలకు లోపలి అశక్తతే హేతువు.

శరీరంలో సంభవించే రసాయన క్రియ అశక్తతకు కారణమని చరక సంహిత చెబుతోంది.

నిర్మల మాంసంతో పాటు మనలోని శక్తిని చేతనంగా కాపాడుకోవడమే స్వస్థత అని సుశ్రుతుడు రాసిన సంహిత, పతంజలి యోగ సూత్రాలు వెల్లడిస్తాయి యోగ అంటే వ్యాయామ సమాహారాల ఆధ్యాత్మిక రూపం. యోగం అంటేనే సౌఖ్యానికి సంకేతం. మోక్షసాధనలో భాగమైన ధ్యానం,

ఆంతరదృష్టి, పరమానంద ప్రాప్తి లాంటి ఆధ్యాత్మిక పరమైన సాధనలకు ‘యోగ పునాది. దీన్ని సాధన చేసేవారిని యోగులు అంటారు. ఈ సాధకులకు ఎలాంటి వ్యాధులు సోకవు. చికిత్సా అవసరం లేదు. వాళ్లకు వయోపరిమితులు ఉండవని అంటారు. నిజానికి జ్వరాలు (వ్యాధులు) లేకపోతే మరణాన్ని నిరోధిం చవచ్చని గౌతమ బుద్ధుడు అష్టాంగమార్గంలో వివరించినట్లు చెబుతారు. యోగ సాధనలో భాగమైన శారీరకమైన ఆసనాలు శరీరారోగ్యానికి తోడ్పడి ఔషధాల వాడకాన్ని తగ్గించి దేహదార్యాన్ని, ముఖవర్చస్సును ఇనుమడింపజేస్తాయని పతంజలి రాసిన ‘యోగ ప్రదీపిక చెబుతోంది.

స్వామి వివేకానంద యోగ సాధనకు ప్రాధాన్యమిచ్చారు. వివేకానందుడు రాసిన రాజయోగం మనిషి తన దేహాన్ని చైతన్యపరచుకొని ఆరోగ్యంగా జీవిస్తే ఎలాంటి కోరిన లక్ష్యాన్నైనా సాధించగలడని చెబుతుంది. మనిషి చిత్తం చంచలం కాకూడదని ఏకత్వమే మనిషి నైజం కావాలన్నది వివేకానందుడి సూచన మానవుడు గమ్యం చేరేవరకు కులంగా జీవిస్తూ కౌశల్యం ప్రదర్శించాలని బౌద్ధంలో భిక్షు నియమావళి వివరిస్తోంది. పతంజలి యోగ సూత్రాల ప్రకారం ‘యోగ అంటే చిత్త వృత్తి నిరోధం. స్థిరంగా ఉండి సుఖాన్నిచ్చేది ఆసనం

సుఖానికి నిర్వచనం శారీరక, మానసిక ఆరోగ్యం. ప్రతి చిన్న శారీరక అసౌక ర్యానికి రసాయనిక మాత్రలు వాడటం మంచిది కాదని ఆధునిక వైద్యులు సైతం అంగీకరిస్తున్నారు. కొన్ని వ్యాధులను తనకు తానే చికిత్స చేసుకొనే గొప్ప నైజం శరీరానికి ఉందని వైద్యశాస్త్రం చెబుతూనే ఉంది. మనిషి తనలోని శక్తిని సదా చైతన్యం చేసుకొని, దేహాన్ని రుగ్మతలకు దూరంగా కాపాడుకొంటే చాలు- యౌవనానికి వృద్ధ్యాప్యానికి పెద్దగా తేడాలుండవు భారతీయ వైద్య విధానం ఏనాడో చెప్పింది.