Fashion

ఇంటిపనులతో స్లిమ్‌గా

ఇంటిపనులతో స్లిమ్‌గా

ప్రస్తుత పరిస్థితుల్లో ఫిట్‌నెస్‌ కోసం జిమ్‌కెళ్లడం సాహసం చేయడమే! ఇంట్లో మీ పనులు మీరు చక్కబెట్టుకుంటే చాలు.. బోలెడన్ని కెలోరీలు కరిగిపోతాయి. కావాల్సినంత ఫిట్‌నెస్‌ సొంతమవుతుంది. ఏ పని చేస్తే ఎన్ని కెలోరీలు ఖర్చవుతాయో తెలుసుకోండి.

దుమ్ము దులిపేద్దాం: ఇంట్లో అన్ని మూలల్లో, గోడల్లో ఉన్న దుమ్ము దులుపుతున్నప్పుడు ఉదర భాగాన్ని బిగించి ఉంచాలి. ఒక రకంగా దీన్ని స్ట్రెచింగ్‌లా ఫీల్‌ అవ్వాలి. దీంతో కండరాలు దృఢంగా అవుతాయి.

ఖర్చయ్యే కెలోరీలు: 166/గంటకి

ఊడ్చేద్దాం: ఇల్లు ఊడుస్తున్నప్పుడు భుజాలను అటూ ఇటూ తిప్పుతుండాలి. పడక, కప్‌బోర్డు, స్టడీ టేబుల్‌, డైనింగ్‌ టేబుళ్ల కింద చీపురుతో చిమ్ముతున్నప్పుడు కాస్త ముందుకు వంగి పని చేయాలి. ఇలా చేస్తే భుజాలు, మోకాళ్లు, తుంటి ఎముకలు బలంగా తయారవుతాయి.

ఖర్చయ్యే కెలోరీలు: 161/గంటకి

దుస్తులు ఉతికేద్దాం: దుస్తులు ఉతికేటప్పుడు బరువు పాదాలపై పడేలా కూర్చోవాలి. వస్త్రాలను పిడికిళ్లలోకి తీసుకొని నేలకేసి అదుముతున్నప్పుడు, పిండుతున్నప్పుడు రెండు చేతులపై సమభారం పడేలా ఎప్పటికప్పుడు మార్చుతుండాలి. ఇలా చేస్తే చేతులు, భుజాలకు వ్యాయామం అవుతుంది. కండరాలు దృఢంగా తయారవుతాయి.

ఖర్చయ్యే కెలోరీలు: 320/గంటకి