DailyDose

అప్పులు తీర్చలేక తన హత్యకు తానే సుపారీ-నేరవార్తలు

అప్పులు తీర్చలేక తన హత్యకు తానే సుపారీ-నేరవార్తలు

* అప్పులు తీర్చే మార్గం లేక ఓ వ్యక్తి తనను చంపమని తానే హంతకులకు సుపారీ ఇచ్చాడు. మరణాంతరం వచ్చే బీమా సొమ్ము కోసమే మృతుడు ఈ ప్రయత్నం చేశాడని విచారణలో వెల్లడైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దిల్లీలోని ఐపీ ఎక్స్‌టెన్షన్‌కు చెందిన కిరాణా దుకాణం యజమాని గౌరవ్‌(37) కనిపించడం లేదని ఆయన భార్య షానూ భన్సాల్‌ ఈ నెల 10న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దుకాణానికి వెళ్లిన తన భర్త ఎంత సేపయినా ఇంటికి తిరగి రాలేదని ఆమె పోలీసులకు తెలిపారు. దీంతో గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులకు దిల్లీ శివారులోని రన్హౌలా ప్రాంతంలో ఓ మృతదేహం ఉన్నట్లు సమాచారం అందింది. ఆ మృతదేహం గౌరవ్‌దేనని కుటుంబ సభ్యుల ద్వారా పోలీసులు నిర్ధారించుకున్నారు.

* ఈఎస్ఐ స్కామ్ నిందితుల కస్టడీకి ఏసీబీ పిటిషన్. మూడు రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని కోరిన ఏసీబీ. స్కామ్ లో ఇప్పటివరకు అరెస్టయిన ఏడుగురు నిందితులు.

* తల్లిని దారుణంగా హత్య చేసిన కొడుకుని ముత్తుకూరు పోలీసులు అరెస్ట్‌ చేశారు. నెల్లూరు రూరల్‌ డీఎస్పీ హరినాథరెడ్డి వివరాలను సోమవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో వెల్లడించారు. చేజర్ల మండలం, తూర్పుకంభంపాడుకు చెందిన తలపల రమణయ్య, భార్య రమణమ్మ, పెద్ద కొడుకు చెంచురామయ్య, రెండో కొడుకు వెంకటేశ్వర్లు అతని భార్య విజయమ్మలు ఐదునెలలుగా బాతులు మేపుతూ జీవనం సాగిస్తున్నారు. వీరందరికీ మద్యం అలవాటు ఉంది. మద్యం మత్తులో చెంచురామయ్య తన మరదలిని లైంగికంగా వేధించడం ప్రారంభించాడు. దీంతో అన్నదమ్ముల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ విషయాన్ని వెంకటేశ్వర్లు పలుమార్లు తల్లి రమణమ్మ దృష్టికి తీసుకెళ్లాడు.

* స్వ‌స్థ‌లానికి చేరుస్తామంటూ 16ఏళ్ల బాలిక‌పై ముగ్గురు దుండ‌గులు సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న దేశ రాజ‌ధాని ఢిల్లీలో సోమ‌వారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం..ఓ ఇంట్లో ప‌నిమ్మాయిగా ప‌నిచేస్తున్న బాలిక త‌న స్వ‌స్థ‌ల‌మైన జార్ఖండ్ వెళ్లేందుకు ఢిల్లీ రైల్వేస్టేష‌నుకు చేరుకుంది. అక్క‌డ ముగ్గురు వ్యక్తులు ఆమెను ఇంటికి చేరుస్తామ‌ని న‌మ్మ‌బ‌లికి ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి మ‌త్తుమందు క‌లిపిన కూల్‌డ్రింక్‌ను బ‌ల‌వంతంగా తాగించి అత్యాచారానికి పాల్ప‌డ్డారు. స్పృహ త‌ప్పి ప‌డిపోయి ఉన్న ఆమెను గ‌మ‌నించిన ఓ పోలీసు కానిస్టేబుల్ బాలిక‌ను స్టేష‌నుకు తీసుకెళ్లి విచారించ‌గా ఈ ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్న‌ట్లు తెలిపారు. అనంత‌రం బాలికకు వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించి శిశు సంక్షేమ క‌మిటీకి అప్ప‌గించిన‌ట్లు అధికారి ఒక‌రు పేర్కొన్నారు.

* ఛతీస్‌గఢ్‌ రాష్ట్రంలోని రాయ్‌ఘడ్‌ జిల్లా ధరమ్జాఘడ్‌ బ్లాక్‌ పరిధిలోని గ్రామంలో మంగళవారం విద్యుదాఘాతంతో ఏనుగు మృతి చెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు, అటవీశాఖ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అటవీ ప్రాంతంలో దుండగులు అక్రమంగా ఏర్పాటు చేసిన విద్యుత్‌ తీగ తగలడంతో విద్యుదాఘాతానికి గురై ఏనుగు మృతి చెందిందని నిర్ధారించారు. మృతి చెందిన ఏనుగు వయసు 7నుంచి 8 సంవత్సరాల వరకు ఉంటుందని రాయ్‌ఘడ్‌ ఎస్పీ సంతోశ్‌కుమార్‌ సింగ్‌ తెలిపారు. ఇదే ప్రాంతంలో ఇదే తరహా ప్రమాదాలు అనేకం జరిగాయని, కొంతమంది ప్రాణాలు సైతం కోల్పోయారని ఎస్పీ పేర్కొన్నారు. నేరంతో సంబంధముందని భావిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు.

* ఓ వ్యాపారీ బ్యాంకు ఖాతాతోపాటు మొబైల్‌ ఫోన్‌ను హ్యాక్‌ చేసిన సైబర్‌ నేరగాళ్లు రూ. 50 లక్షలు కొట్టేశారు. ఓటీపీలు రాకుండా సెల్‌ఫోన్‌ను తమ స్వాధీనంలోకి తీసుకున్న సైబర్‌ మోసగాళ్లు రెండు దఫాలుగా ఈ మొత్తాన్ని పశ్చిమ బెంగాల్‌లోని తమ ఖాతాలోకి బదిలీ చేసుకున్నారు. ఇటీవల కాలంలో ఇలాంటి ఘటన జరుగడం ఇది రెండోది కావడంతో సైబర్‌క్రైం పోలీసులు అలర్ట్‌ అయ్యారు.