DailyDose

అనంత తెదేపా నేతలపై కేసు-నేరవార్తలు

అనంత తెదేపా నేతలపై కేసు-నేరవార్తలు

* సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండల పరిదిలోని హోతి(కె) గ్రామ శివారులో గురువారం మధ్యాహ్నం బుచ్చయ్య పొలం మూలమలుపు పై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో ఝరసంగం మండలం బొప్పానపల్లి గ్రామానికి చెందిన విఠల్ రెడ్డి అనే వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు. విఠల్ రెడ్డి తో పాటు మరో వ్యక్తి కలిసి మోటార్ వాహనంపై తాండూరు వెళ్తుండగా ఎదురుగా వస్తున్న లారీ వారిని భలంగా ఢీ కొట్టడంతో విఠల్ రెడ్డి అక్కడిక్కడే మృతి చెందారాని ఎస్ ఐ వినయ్ కుమార్ తెలుపరు. విఠల్ రెడ్డి సంఘటనా స్థలంలో మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉందని ఎస్ ఐ తెలిపారు. కేసు నమోదు చెలుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ ఐ వినయ్ కుమార్ తెలిపారు.

* లెబర్ కాలనీ లో దారుణం..ప్రేమించిన అమ్మాయి దూరం పేట్టుంది అని బీర్ సీసా తో పోడిచిన లెబర్ కాలనీ చెందిన నిఖిల్అమ్మాయిని ఏంజిఏం ఆసుపత్రి కి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్న మిల్స్ కాలనీ పోలిసులు..

* వివాదాస్పద ‘మ్యాప్’కు నేపాల్​ ఎగువ సభ ఆమోదం​. వివాదాస్పద నేపాల్ మ్యాప్​ సవరణ బిల్లుకు ఆ దేశ ఎగువ సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఇప్పటికే దిగువ సభలో బిల్లు ఆమోదం పొందింది.

* తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్‌ పర్యటనకు ఏర్పాట్లు చేసిన ఇద్దరిపై అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణ పోలీసులు లాక్‌డౌన్‌ ఉల్లంఘన కేసు నమోదుచేశారు.

* వారిద్దరూ స్నేహితులు. ఎప్పటిలాగే ఆ రోజు కూడా ఇంట్లో సంతోషంగా విందు చేసుకున్నారు. అయితే ఒక్కసారిగా ఇద్దరి మధ్య గొడవ తలెత్తింది. అంతే మద్యం మత్తులో ఓ యువకుడు స్నేహితుడి తలపై రోకలితో కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అంతర్గాం మండలం గోయల్‌వాడలో మంగళవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం గోయల్‌వాడకు చెందిన మామిడాల అనిల్‌, నేరెళ్ల చందు(27) స్నేహితులు. అవివాహితులైన ఇద్దరూ వారి కుల వృత్తి పనులు చేస్తూ కుటుంబాలకు చేదోడుగా ఉన్నారు. మంగళవారం అనిల్‌ ఇంట్లో అతడితో పాటు చందు, అనిల్‌ తండ్రి శంకరయ్య విందు చేసుకున్నారు. మద్యం తాగుతుండగా అనిల్‌, చందుల మధ్య మాటామాటా పెరిగి గొడవకు దారి తీసింది. వారిని ఆపేందుకు శంకరయ్య ప్రయత్నించగా వారు అతడిని బయటకు పంపారు. కొద్దిసేపటికి శంకరయ్య ఇంట్లోకి వెళ్లి చూడగా రక్తం మడుగులో చందు విగత జీవిగా కనిపించాడు. మంచం పక్కనే రోకలి ఉంది. అనిల్‌, చందు మధ్య ఏ విషయమై గొడవ జరిగిందనేది తెలియాల్సి ఉంది. రామగుండం సి.ఐ. టి.కరుణాకర్‌రావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నిందితుడు అనిల్‌ పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. మృతుడు చందు తల్లి రాజమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు ఏఎస్‌ఐ టి.పురుషోత్తంరెడ్డి తెలిపారు.

* ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగిన ఓ వివాహ విందులో విషాదం చోటుచేసుకుంది. వివాహ విందు గురించి ఆగ్రహించిన వరుడు.. సొంత బావమరిదినే చంపేశాడు. అంతేకాకుండా తన వాహనంతో బంధువులపైకి దూసుకెళ్లి ముగ్గురుని గాయపరిచాడు. పోలీసులు ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫరుఖాబాద్‌కి చెందిన మనోజ్‌ కుమార్‌ అనే వ్యక్తికి అదే ప్రాంతానికి చెందిన ఓ యువతితో సోమవారం రాత్రి వివాహం జరిగింది. ఈ వివాహ విందులో మిఠాయిలు వడ్డించే విషయంలో వరుడు, అతని స్నేహితులు వధువు తరపు బంధువులతో వాదనకు దిగారు. దీంతో ఘర్షణ పెద్దది కాకుండా ఇతర బంధువులు జోక్యం చేసుకున్నారు. మద్యం మత్తులో ఉన్న వరుడు, అతని స్నేహితులు తన మామయ్యపై కాల్పులు జరిపినట్లు వధువు సోదరుడు పునీత్‌ తెలిపాడు. ఈ ఘటన నుంచి ఆయన తృటిలో తప్పించుకున్నట్లు పేర్కొన్నాడు. అనంతరం అక్కడే నీళ్లు అందిస్తున్న తన సోదరుడు ప్రన్షు (9)ను వరుడు, అతని స్నేహితులు తమ వాహనంలో ఎక్కించుకొని వెళ్లారని ఆయన తెలిపాడు. ఈ క్రమంలో వరుడు కారులో వేగంగా వెళుతూ ఇద్దరు మహిళలు, ఒక బాలికను ఢీకొట్టినట్లు తెలిపాడు. అనంతరం కారులో పారిపోయినట్లు పునీత్‌ పేర్కొన్నాడు. తిరిగి రావాలని వరుడు మనోజ్‌కు ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా అతను వెనక్కి రాలేదని, తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ప్రన్షు మృతదేహాన్ని గ్రామంలో వదిలివెళ్లారని ఆయన వెల్లడించారు. దీంతో వధువు తండ్రి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ప్రన్షు మెడపై గొంతు నులిమిన గుర్తులున్నాయని వధువు కుటుంబ సభ్యులు పోలీసుల కిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. వరుడు, అతని స్నేహితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

* కంచే చేను మేసిందన్నట్లుగా.. మానవ సంబంధాలు మంట కలిసిన ఘటన ఇది.. సభ్యసమాజం తల దించుకునే ఉదంతంమిది.. కంటికి రెప్పలా ఉండాల్సిన ఓ తండ్రే తన కూతురికి కడుపు చేసి మానవత్వానికి మాయని మచ్చలా నిలిచాడు. ప్రస్తుతం ఆ బాలిక 5 నెలల గర్భవతి. మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్‌లో ఈ దారుణం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. కర్ణాటక రాష్ట్రం బీదర్‌కు చెందిన వ్యక్తి (34) ఆరేళ్ల క్రితం బతుకుదెరువు నిమిత్తం నగరానికి కుటుంబంతో వలస వచ్చాడు. సూరారం శివాలయ నగర్‌లో ఉంటూ పెయింటర్‌గా పని చేస్తున్నాడు. ఇతనికి భార్య, కుమార్తె (14), కుమారుడు ఉన్నారు. కొన్ని నెలల క్రితం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటరిగా ఉన్న కుమార్తెను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం ఎవరికైనా చెప్తే అందరినీ చంపుతానని హెచ్చరించాడు. అడపాదడపా అఘాయిత్యానికి పాల్పడుతూనే ఉన్నాడు.