Business

ఇండియా ఆర్థికంగా బలంగా ఉంది

ఇండియా ఆర్థికంగా బలంగా ఉంది

భారత ఆర్థిక వ్యవస్థ చాలా వేగంగా పుంజుకుంటుందని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఎండీ, సీఈఓ ఆదిత్య పురి పేర్కొన్నారు. కొవిడ్‌-19కు ముందు ఉన్న స్థాయికి జీడీపీ వృద్ధి వెళ్లడం చాలా అవసరమని అభిప్రాయపడ్డారు. కొవిడ్‌-19 మహమ్మారిని తట్టుకుని బ్యాంక్‌ చాలా బలంగా నిలబడిందని ఉద్యోగులకు ఈ నెల ప్రారంభంలో పంపిన ఇ-మెయిల్‌లో ఆదిత్య వెల్లడించారు. ‘కొవిడ్‌ సంక్షోభం చాలా తీవ్రమైంది. నిర్ణీత కాలవ్యవధిలో సరఫరా, గిరాకీని ఇది చంపేసింది. అయితే భారత్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ భవిష్యత్‌ చాలా ఉజ్వలంగా ఉంటుందన్న ధీమా నాకుంది. దేశం కూడా కరోనా నుంచి చాలా వేగంగా కోలుకుంటుంది’ అని ఆదిత్య పురి ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనా సంక్షోభం తర్వాత మంచి వ్యూహాలు, టెక్నాలజీ, మూలధనం, నగదు లభ్యత, నాయకత్వం కలిగిన కంపెనీలు విజేతలుగా నిలుస్తాయని అన్నారు. ప్రతికూల సమయంలోనూ బ్యాంక్‌ ఉద్యోగులకు బోనస్‌, వేతనాల పెంపులను కొనసాగించిందని తెలిపారు. ఈ ఏడాది అక్టోబరులో ఆదిత్య పురి పదవీ విరమణ చేయనున్నారు.