Devotional

గ్రహణం రోజున తిరుమలలో దర్శనాలు బంద్

జూన్ 21న సూర్యగ్రహణం కార‌ణంగా శ్రీ‌వారి ఆల‌యంలో ద‌ర్శ‌నం నిలుపుద‌ల

జూన్ 21న సూర్యగ్రహణం కార‌ణంగా తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం ఉండ‌దు.

ఈ విషయాన్ని భ‌క్తులు గ‌మ‌నించాల‌ని టిటిడి కోరుతోంది.

జూన్ 21న ఆదివారం ఉదయం 10.18 గంట‌ల నుండి మ‌ధ్యాహ్నం 1.38 గంట‌ల వరకు సూర్యగ్రహణం ఉంటుంది.

జూన్ 20వ తేదీ రాత్రి 8.30 గంట‌ల‌కు ఏకాంత సేవ త‌రువాత మూసిన శ్రీ‌వారి ఆల‌య తలుపులను జూన్ 21న మ‌ధ్యాహ్నం 2.30 గంట‌ల‌కు తెరుస్తారు.

మ‌ధ్యాహ్నం 2.30 నుండి సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు సుప్ర‌భాతం, శుద్ధి, పుణ్యాహ‌వ‌చ‌నం, తోమాల సేవ, కొలువు, బంగారు వాకిలి లోప‌ల పంచాంగ శ్ర‌వ‌ణం నిర్వ‌హిస్తారు.

అనంత‌రం మొద‌టి అర్చ‌న‌, మొద‌టి గంట‌, బ‌లి శాత్తుమొర‌, రెండో అర్చ‌న, రెండో గంట త‌దిత‌రాల‌ను ఏకాంతంగా చేప‌డ‌తారు.