DailyDose

బెయిల్ కావాలని అర్జీ పెట్టుకున్న అచ్చెన్న-నేరవార్తలు

బెయిల్ కావాలని అర్జీ పెట్టుకున్న అచ్చెన్న-నేరవార్తలు

* ఈఎస్ఐ కేసులో అవినీతికి, త‌న‌కు ఎలాంటి సంబంధం లేద‌ని, త‌నకు ఆరోగ్యం బాగోలేద‌ని తెలుపుతూ .. బెయిల్ మంజూరు చేయాల‌ని హైకోర్టును కోరిన టీడీపి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు!కౌంట‌ర్ దాఖ‌లు చేయాల‌ని ప్ర‌భుత్వానికి హైకోర్టు ఆదేశం!తదుపరి విచార‌ణ‌ సోమ‌వారానికి వాయిదా!

* కృష్ణాజిల్లా÷ నందిగామ( మం) మాగల్లు వద్ద ఎదురెదురుగా రెండు బైకులు ఢీకొని ఘటనలో నలుగురికి గాయాలు నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు కేసు నమోదు

* కృష్ణాజిల్లా పెడన నియోజకవర్గం బంటుమిల్లి మండలం అధిక మద్యం బాటిళ్ల ను ట్రావెల్ చెస్తూ పట్టుబడ్డ తొమ్మిది మందిపై కెసు నమోదు చేసిన బంటుమిల్లి ఎస్.ఐ.

* కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులో భారీగా పట్టుబడ్డ మద్యం.తెలంగాణ రాష్ట్రం ఖమ్మం నుంచి అక్రమంగా వ్యానులో తరలిస్తున్న 2460 మద్యం బాటిల్స్ ను పట్టివేత. మూడు లక్షల 30 వేల రూపాయల మద్యం సీజ్.

* మచిలీపట్నం మండలం చిన కరగ్రహారం గ్రామంలో అభయ ఆంజనేయ స్వామి దేవాలయంలో హుండీలో డబ్బులు చోరీ..

* మంచిర్యాల జిల్లా తాండూరు మండలం రేచినిలో విషాదం చోటుచేసుకుంది. నీటిగుంటలో పడి ఇద్దరు పిల్లలు మృతి చెందారు. రేచిని గ్రామానికి చెందిన మురికి తిరుమల్(14), మురికి మహేష్(8) గురువారం సాయంత్రం జేసీబీ తవ్విన గుంటలో పడిపోయారు. పడిపోయిన విషయం కుటుంబ సభ్యులు గమనించక పోవడం వల్ల రాత్రంతా వారి ఆచూకీ కోసం గ్రామమంతా గాలించారు. అర్థరాత్రి ఒంటి గంటకు నీటి గుంటలో మృతదేహాలు పైకి తేలడంతో పిల్లల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.గొర్రెల మంద ఉండడం వల్ల పిల్లలు సాయంత్రం అక్కడే ఆడుకున్నారు. ఆడుకుంటూ గుంటలో పడ్డారు. పిల్లల మృతదేహాలను చూసి తల్లిదండ్రులు విలపించిన తీరు అందరినీ కలచి వేసింది.
తాండూర్ ఎస్సై శేఖర్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని ఘటనకు గల కారణాలను సేకరిస్తున్నారు.

* అదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ వైద్య కళాశాలలో సరైన చికిత్స అందక ఎనిమిది నెలల గర్భిణీ స్త్రీ పూరక జయశీల మృతి.

* తడ ఆగివున్న గూడ్సు వ్యాగన్‌లో 250 బస్తాల బియ్యం చోరీకి గురైన విషయం తడ రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకుంది. ఈవిషయం శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బియ్యం బస్తాల చోరీపై ఆర్‌.పి ఎఫ్‌ చెన్నై సహాయ కమిషనర్ అనిల్‌ తడకు చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఆయన వివరాల మేరకు ఈ ఏడాది ఫిబ్రవరిలో వైజాగ్‌ నుంచి తిరుచ్చి వెళ్లే గూడ్సులో ఒక వ్యాగన్‌ చక్రం మరమ్మతులకు గురవడంతో తడ రైల్వేస్టేషన్‌ లూప్‌ లైన్‌లో నిలిపారు. వ్యాగన్‌ను ఇక్కడే ఉంచి గూడ్సును పంపించేశారు. ఈక్రమంలో లాక్‌డౌన్‌ ప్రకటించడంతో వ్యాగన్‌ను తీసుకెళ్లడంలో ఆలస్యం అయింది.

* కావలి లో గుట్కా మాఫియా తీగలాగితే డొంక కదిలింది. పొగాకు ఉత్పత్తులు సరఫరా చేస్తున్న మహేష్ అనే యువకుడిని అదుపులోకి తీసుకొని విచారించిన పోలీసులు. మహేష్ అందించిన సమాచారం ఆధారంగా మద్దూరు పాడు గ్రామం లోని ఒక ఇంటిని తనిఖీ చేయగా పొగాకు ఉత్పత్తులతో పాటు భారీగా నగదు వెలుగు చూసింది. వన్ టౌన్ సిఐ శ్రీనివాస రావు ఆధ్వర్యంలో ప్రణాళికాబద్ధంగా పొగాకు ఉత్పత్తుల మాఫియాను 41 లక్షల 36 వేల478 రూపాయలు నగదును సీజ్ చేసి 3గురు నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. విధుల్లో కి హాజరైన అతికొద్ది కాలంలోనే వన్ టౌన్ సిఐ శ్రీనివాస రావు అసాంఘిక శక్తులకు సవాలు విసిరారు. ఈ ఆపరేషన్లో రూరల్ ఎస్ఐ జె మాల్యాద్రి వారి సిబ్బంది పాల్గొన్నారు.

* తూర్పు లడఖ్‌లో భారత్‌-చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణలు చోటు చేసుకుని పదుల సంఖ్యలో సైనికులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆ సమయంలో చైనా అదుపులోకి తీసుకున్న 10 మంది భారత సైనికులను ఆ దేశం విడిచిపెట్టింది.

* పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో డ్రగ్స్‌ వినియోగిస్తున్న ఓ ఇంజినీరింగ్‌ విద్యార్థిని చెన్నై కస్టమ్స్‌ అధికారులు అరెస్టు చేశారు. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా బయటకురావడంతో భీమవరంలో ఒక్కసారిగా కలకలం మొదలైంది.