Business

నిత్యావసరాల ధరలు మండుతున్నాయి

Groceries Prices In Andhra On High Rise

రోజూ వంటలోకి కావాల్సిన సరకుల ధరలన్నీ నానాటికీ పెరుగుతున్నాయి.

ఉల్లిపాయ.. గతేడాది కొనక ముందే కన్నీరు పెట్టించింది.

చింతపండు మినహా మిగిలిన నిత్యావసర వస్తువుల ధరలన్నీ అంతకుముందు ఏడాదితో పోలిస్తే గతేడాది బాగా పెరిగాయి.

అదే సమయంలో ప్రజల దినసరి వేతనాలు స్వల్పంగానే పెరిగాయని రాష్ట్ర ఆర్థిక సర్వే వెల్లడించింది. అన్ని సరకుల ధరలు పెరిగిపోయాయి. ఉల్లిపాయల రేటు 131.60% పెరగడం విశేషం.

రాష్ట్రంలో డిమాండ్‌, సరఫరా మధ్య వ్యత్యాసంతో నిత్యావసరాల ధరలు పెరిగాయని ఆర్థిక సర్వే విశ్లేషించింది.

రాష్ట్రంలో ఎంపిక చేసిన ప్రాంతాల్లో నిత్యం సగటున ఈ ఆరు రకాల సరకుల ధరలు ఎలా ఉన్నాయో సమాచారం సేకరించి రాష్ట్ర అర్థ గణాంకశాఖ ఈ సగటు లెక్కలు రూపొందించింది.