DailyDose

తెలంగాణా డీజీపీ కార్యాలయంలో కరోనా కలకలం-TNI బులెటిన్

TNILIVE Corona Bulletin || COVID19 Positive In Telangana DGP Office

* తెలంగాణ పోలీస్ డిపార్ట్ మెంట్ లో కరోనా కలకలం. పలువురు ఐపీఎస్ అధికారులకు కరోనా పాజిటివ్. ఒక మహిళ ఐపీఎస్ ఉన్నతాఅధికారి కరోనా పాజిటివ్. పలువురు ఐపీఎస్ అధికారులకు కరోనా పాజిటివ్ రావడంతో హోమ్ క్వరంటాయిన్ లో ఉన్న అధికారులు. డీజీపీ కార్యాలయంలో సైతం ఉద్యోగికి కరోనా.

* తెలంగాణలో భారీగా పెరిగిన కేసులు

★ తెలంగాణలో కరోనా రోజురోజుకూ విజృంభిస్తోంది.

★ ఇవాళ ఒక్కరోజే 499 కేసులు వెలుగుచూశాయి.

★ ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 329 కేసులు నమోదయ్యాయి.

★ రంగారెడ్డి జిల్లా పరిధిలో మరో 129 కేసులు వచ్చాయి.

★ దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6,526కి చేరింది.

★ గడిచిన 24 గంటల్లో మరో మూడు మరణాలు సంభవించాయి. దీంతో మరణాల సంఖ్య 198కి చేరిందని వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.

★ ఇవాళ మొత్తం 2,477 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. అందులో 1,978 మందికి నెగిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.

★ ఇప్పటి వరకు రాష్ట్రంలో 50,569 మంది పరీక్షలు నిర్వహించినట్లు వైద్యారోగ్యశాఖ పేర్కొంది.

★ మరో 51 మంది డిశ్చార్జి అయ్యారు. దీంతో ఇప్పటి వరకు డిశ్చార్జి అయిన వారి సంఖ్య 3,352కి పెరిగింది.

★ రాష్ట్ర వ్యాప్తంగా 2,976 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.

* కరోనాతో నిండిన రుయా ఆసుపత్రి. కలెక్టర్ ఆదేశాలతో 100 మందిని పద్మావతి క్వారంటైన్ కు తరలింపు.

* ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ 190 బులిటెన్‌ విడుదల..!! ఆంధ్రప్రదేశ్ లో 7961 కు చేరుకున్న కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య. గడచిన 24 గంటల్లో 17,609 సాంపీల్స్ ని పరీక్షించగా మొత్తం 465 కేసులలో రాష్ట్రం నుంచి 376, ఫారిన్ రేటర్నెస్ నుంచి 19 మరియు ఇతర రాష్ట్ర ప్రజల నుంచి 70 కోవిడ్19 పాజిటివ్ గా నిర్దారింపబడ్డారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారి సంఖ్య 3960. 3905 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు ఏపీ లో కరోనా పాజిటివ్ తో 96 మంది మృతి.

* ఆంధ్రప్రదేశ్ లో కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో… రేపటి నుంచి 14రోజుల లాక్‌డౌన్ ప్రకటించిన ప్రాంతాలు. శ్రీకాకుళం జిల్లా పలాస, కాశీబుగ్గ ప్రాంతాలలో సంపూర్ణ లాక్‌డౌన్ అమలు చేయనున్నట్టు ప్రకటించిన కలెక్టర్ జె.నివాస్. అనంతపురం జిల్లాలో… అనంతపురం, తాడిపత్రి, ధర్మవరం, హిందూపురం, యాడికి, పామిడి, కదిరి, గుంతకల్లు. ప్రకాశం జిల్లాలో… ఒంగోలు, చీరాల లో పూర్తి స్థాయి లాక్‌డౌన్ అమలు చేయనున్నట్లు ప్రటించారు ఆయా జిల్లా కలెక్టర్లు.