Health

నిద్రలేమి సమస్యను నివారించే కుంకుమపువ్వు

Saffron Helps Treating Insomnia || TNILIVE Saffron Helps Treating Insomnia || TNILIVE 2020 Telugu Health News

కారణాలేవయినా ప్రస్తుతం ప్రపంచంలో అధికశాతం మంది ఎదుర్కొంటోన్న సమస్య నిద్రలేమి. దీనికోసం వ్యాయామాలూ మాత్రలూ ఆహారం ఇలా ఎవరికి తోచిన మార్గాలు వాళ్లు అనుసరిస్తున్నారు. అయినప్పటికీ ఇది పెరుగుతూనే ఉంది కానీ తగ్గడం లేదు. అయితే వాటన్నింటికన్నా కుంకుమపువ్వు నుంచి తీసిన ఎక్స్‌ట్రాక్ట్‌ను ఇవ్వడం వల్ల బాగా నిద్ర పడుతుంది అంటున్నారు ఆస్ట్రేలియాకి చెందిన మర్డోక్‌ విశ్వ విద్యాలయ నిపుణులు. ఇందుకోసం వీళ్లు ఇతరత్రా ఆరోగ్య సమస్యలేమీ లేకుండా కేవలం నిద్రలేమితో బాధపడుతున్న 68 మందిని ఎంపికచేసి వాళ్లలో సగం మందికి మాత్రం 28 రోజులపాటు రోజుకి రెండుసార్లు చొప్పున 14 మి.గ్రా. మోతాదులో ఈ ఎక్స్‌ట్రాక్ట్‌ను ఇచ్చారట. వీళ్లలో మూడు వంతులమంది బాగా నిద్రపట్టినట్లు చెప్పారట. అయితే ఇది ఏ రకంగా నిద్రను ప్రభావితం చేస్తుందనేది ఇంకా పరిశీలించాల్సి ఉందట.