DailyDose

బెజవాడ రౌడీలకు పోలీసుల హెచ్చరికలు-నేరవార్తలు

TNILIVE Telugu Crime News Roundup Today || Vijayawada Police Warns Rowdysheets

* బెజవాడ రౌడీషీటర్లకు ఫైనల్ వార్నింగ్..విజయవాడ రౌడీషీటర్లకు పోలీసులు కౌన్సిలింగ్‌నేరాల అదుపుతోపాటు, శాంతి భద్రతలపై  పోలీసులు సీరియస్‌గా దృష్టి సారించారు. నేరాలపై ఉక్కుపాదం మోపుతున్నారు.నగర సీపీ బత్తిన శ్రీనివాసులు ఆదేశాల మేరకు నగరంలో రౌడీషీటర్ల​కు కౌన్సిలింగ్‌ ఇచ్చారు.అజిత్ సింగ్ నగర్, నున్న పోలీస్‌స్టేషన్‌ పరిధిలో పాత నేరస్తులకు సీఐలు లక్ష్మీనారాయణ, ప్రభాకర్ లు కౌన్సిలింగ్ ఇచ్చి, వారి నుంచి పూర్తి వివరాలు తెలుసుకున్నారు.ఎక్కడ నివాసం ఉంటున్నారు.ఏం పని చేసి జీవిస్తున్నారో ఆరా తీశారు.అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 47 మంది రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు.నగరంలో ఎక్కడైనా పాత నేరస్తులు ఇబ్బంది పెడుతుంటే తమ దృష్టికి తేవాలని సీఐలు విజ్ఞప్తి చేశారు.అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.రౌడీషీటర్లు అందరితో కలసిపోయి మంచిగా జీవనం సాగించాలన్నారు.మంచిగా జీవిస్తున్న వారిని తమ దృష్టికి తీసుకువస్తే అధికారులతో చర్చించి రౌడీషీట్ ఎత్తివేసేలా కృషిచేస్తామని పోలీసులు చెప్పారు.

* కారంపూడి మండలం పేట సన్న గండ్ల గ్రామ తండ సమీపంలోని సుగాలి రైతు కొద్దిసేపటి క్రితం తన పొలంలోని మోటార్ స్విచ్ ఆన్ చేస్తుండగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల మృతి చెందినట్లు తెలిసింది.

* రైల్వే ట్రాక్‌పై నిలబడి సెల్ఫీ ఫోటో తీసుకుని తన తల్లిదండ్రులకు పంపి కంగారు పెట్టించాడు ఓ యువకుడు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. గన్‌బజార్‌కు చెందిన లీలావర ప్రసాద్ అనే యువకుడు తన తల్లిదండ్రులతో గొడవ పడి, వారి మీద కోపంతో వెళ్లిపోయాడు. ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకుని, రైల్వే ట్రాక్‌పై నిలబడి సెల్ఫీ ఫోటో తీసుకుని వారికి పంపాడు.దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఈ సమాచారం అందించారు. దీంతో పోలీసులు వెంటనే చర్యలు తీసుకుని రైల్వే ట్రాక్‌పై ఉన్న లీలావర ప్రసాద్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడికి కౌన్సిలింగ్ ఇచ్చి, తల్లిదండ్రులకు అప్పగించారు.

* వెస్ట్ బెంగాల్ నుండి తమిళనాడు కు అక్రమంగా రవాణా చేస్తున్న ఆవు మాంసం గుట్టురట్టు అయ్యింది.కోల్కతా నుండి చెన్నైకు కంటైనర్ లో ఈ ఆవు మాంసం రవాణా అవుతున్న సమాచారం ఒడిశా భాజరంగ్దళ్ కార్యకర్తలకు తెలిసింది.ఒడిస్సా నుండి ఆ కంటైనర్ ను వెంబడించిన ఒడిస్సాభజరంగ్ దళ్ కార్యకర్తలుఆంధ్ర చెక్ పోస్ట్ పురుషోత్తపురం వద్ద అడ్డుకున్నారు. ఆ కంటైనర్ ను భజరంగ్దళ్ కార్యకర్తలుఇచ్చాపురం పట్టణ పోలీసులకు అప్పగించారు. కంటైనర్ను అదుపులోకి తీసుకుని, విచారణ చేపట్టినట్లు ఇచ్చాపురం పట్టణ ఎస్సై వి. సత్యన్నారాయణ తెలిపారు.

* శ్రీనగర్​లో ముగ్గురు ముష్కరులు హతంశ్రీనగర్ లోని జాదిబాల్​లో జరిగిన ఎన్​కౌంటర్​లో తాజాగా ఇద్దరు ముష్కరులు హతమయిన నేపథ్యంలో.. మృతుల సంఖ్య మూడుకు చేరింది.నిఘా వర్గాల కచ్చితమైన సమాచారం మేరకు జాదిబాల్ ప్రాంతంలో భద్రతాబలగాలు నిర్బంధ తనిఖీలు చేపట్టాయి.ఈ నేపథ్యంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. సమాధానంగా భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు చేశారు.ఈ ఆపరేషన్​లో ఇప్పటివరకు ముగ్గురు ముష్కరులు హతమయ్యారు.మృతుల వివరాలు తెలియరాలేదని అధికారులు ప్రకటించారు.ముష్కరుల ఏరివేత కోసం ఇప్పటికే అంతర్జాల సేవలు నిలిపేశారు.ప్రజా రవాణాపై ఆంక్షలు విధించారు. ఆపరేషన్ కొనసాగుతోంది.

* రేవేంద్ర పాడు వద్ద తౌడు లారీలో భారీగా తరలిస్తున్న తెలంగాణ మద్యం పట్టువేతవీటి విలువ రూ.3.50 లక్షలు ఉంటుందని అంచనాపట్టుపడ్డ వాహనాల విలువ మరో రూ.3.50 లక్షలు72 కేసుల్లో 3742 సీసాలు స్వాధీనం చేసుకున్న తెనాలి ఎక్సైజ్ పోలీసులుసూర్యాపేట నుంచి వివిధ ప్రాంతాలకు విక్రయించేందుకు తెనాలి తరలిస్తుండగా రెవేంద్రపాడు వద్ద పట్టుకున్న పోలీసులు7 గురిపై కేసు నమోదు చేసిన పోలీసులు5 గురుని అదుపులోకి తీసుకున్న ఎక్సైజ్ పోలీసులు..ఇద్దరు పరార్